అర్జిత్‌సింగ్‌ సంచలన నిర్ణయం..ప్లేబ్యాక్‌ సింగింగ్‌కి గుడ్‌ బై!

Viswa
2 Min Read

Web Stories

Arijit Singh Announces Retirement From Playback Singing: బాలీవుడ్‌ ప్రముఖ యువ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు (Arijit Singh retirement). ఇకపై ప్లేబ్యాక్‌ సింగర్‌గా కొనసాగనని, ప్లే బ్యాక్‌సింగర్‌గా రిటైర్‌ట్మెంట్‌ ప్రకటించాడు. అలాగే ఇకపై ప్లేబ్యాక్‌ సింగర్‌గా కొత్త పాటలేవీ అంగకరించనని కూడా అర్జిత్‌ సింగ్‌ తెలిపారు (Arijit Singh announces retirement).

పశ్చిమబెంగాల్‌కు చెందిన అర్జిత్‌ 2005లో ఓ రియాలిటీ షో ద్వారా గాయకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు. 2011లో బాలీవుడ్‌ ఏంట్రీ ఇచ్చాడు. తొలిసారిగా హిందీ చిత్రం ‘మర్డర్‌ 2’లో ‘ఫిర్‌ మొహబ్బత్‌’ అనే పాట పాడారు. ‘పద్మావత్‌’ చిత్రంలోని ‘బింటే దిల్‌’, ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌ 1’ చిత్రంలోని ‘కేసరియా’ పాటలకు గానూ అర్జిత్‌ సింగ్‌ ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌గా జాతీయ అవార్డులు అందుకున్నాడు. అలాగే గత ఏడాది అర్జిత్‌సింగ్‌కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. ఇక మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్ఫూటిఫైలో అత్యధిక మ్యూజిక్‌ ఫాలోయేర్స్‌ కలిగిన ఇండియన్‌ సింగర్‌గా ఆర్జిత్‌ సింగ్‌ పేరిట రికార్డులు ఉన్నాయి (Arijit Singh retires playback singing).

‘ఆషికీ 2’ చిత్రంలోని ‘తుహీ తుమ్‌ హీ హో’, ‘అగర్‌ తుమ్‌ సాథ్‌ హో’, ‘ఫిర్‌ లే ఆయా దిల్‌’ ‘రాబ్తా’, ‘అప్నా బనా లే..’ వంటి ఎన్నో సూపర్‌హిట్‌ హిందీ పాటలను అర్జిత్‌ సింగ్‌ పాడారు. తమిళం, తెలుగు, గుజరాతీ, కన్నడ ఇలా పలుభాషల్లో అర్జిత్‌ సింగ్‌ ఎన్నో పాటలు పాడి, శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నారు (Arijit Singh Telugu songs)

అర్జిత్‌ సింగ్‌ (Arijit Singh new music 2026) కు తెలుగు సినిమాతోనూ మంచి అనుబంధమే ఉంది. అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోని ‘మాయా’, శ్రీవిష్ణు సినిమా ‘ఓం భీమ్‌ భుష్‌’ చిత్రంలోని ‘అణువణువు’, నాగచైతన్య ‘దోచెయ్‌’సినిమాలోని ‘హీ ఈజ్‌ మిస్టర్‌ మోసగాడు’ వంటి పాటలను పాడారు. ఉయ్యాల జంపాల, స్వామిరారా, నీ జతగా నేనుండాలి’ వంటి ఎన్నో పాటలను ఆర్జిత్‌ సింగ్‌ పాడారు (Arijit Singh new music 2026).

ఇక హిందీలో అర్జిత్‌సింగ్‌ పాడిన చివరి పాట, ‘మాతృభూమి’ అని, ఈ పాట సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘ది బ్యాటిల్‌ఆఫ్‌ గాల్వాన్‌’ చిత్రంలోనిదనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. మరోవైపు ప్లేబ్యాక్‌ సింగర్‌గానే అర్జిత్‌ సింగ్‌ రిటైర్మెంట్‌ తీసుకున్నారని, ఇండిపెండెంట్‌ సింగర్‌గా ఆయన కొనసాగే అవకావం ఉందని, ఈ విషయంపై ఆయన్ను నుంచి త్వరలోనే ఓ ప్రకటన రావొచ్చనే ఊహాగానాలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

Please Share
Share This Article
142 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu