Om Shanti Shanti Shantihi First review: ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత రీమేక్ సినిమాల జోరు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే..ఒక సినిమా ఒక భాషలో మేకింగ్ జరుపుకుంటే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పాపులర్ లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి సమయంలో మలయాళ హిట్ ఫిల్మ్ ‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ‘ఓం శాంతి శాంతి శాంతి:’ (Om Shanti Shanti Shantihi Telugu movie)చిత్రం రాబోతుంది. తరుణ్‌భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన తారాగణం. ఏఆర్ సజీవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరచయం అవుతున్నారు (Om Shanti Shanti Shantihi movie First review).
లాక్‌డౌన్ సమయంలో ‘జయ జయ జయ జయహే’ సినిమాను చాలామంది తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో చూశారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు రీమేక్‌గా రాబోతున్న ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రం ఎలా ఉండబోతుంది, ఏఆర్ సజీవ్ ఈ సినిమాను ఎంత కొత్తగా తెలుగు ఆడియన్స్‌కు ప్రజెంట్ చేయబోతున్నారనే ఆసక్తి ఆడియన్స్‌లో కొంత నెలకొని ఉంది.
(Om Shanti Shanti Shantihi cast and crew)‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రంలో ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్‌భాస్కర్ (Tharun Bhascker), ప్రశాంతి పాత్రలో ఈషా రెబ్బా (Eesha Rebba) నటించారు. బ్రహ్మాజీ, గోపరాజు రమణ, ….వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది (Telugu remake Jaya Jaya Jaya Jaya Hey)
ఈషాకు గోదావరి యాసపై తన చిన్నతనం నుంచే పట్టు ఉంది. ఎందుకంటే..ఈషా అమ్మమ్మ వాళ్ల నేటివ్ ప్లేస్ గోదావరి ప్రాంతమే. ఇక ఇప్పటివరకు తెలంగాణ యాసలోనే మాట్లాడిన తరుణ్‌భాస్కర్, ఈ సినిమా కోసం గోదావరి యాసలో మాట్లాడారు. ఈ యాసలో తరుణ్‌భాస్కర్ డైలాగ్ డెలివరీ ఎలా ఉండబోతుంది? ఎంత వరకు హ్యూమర్‌ను జనరేట్ చేయబోతున్నారు? అన్న అంశాలపై కాస్త ఆసక్తి ఉంటుంది.
ఇక కథ విషయానికి వస్తే…భార్యాభర్తల మధ్య సాగే ఎమోషనల్ జర్నీయే ఈ సినిమా. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్న తర్వాత, కొన్ని అంచనాల మధ్య అత్తారింటికి వెళ్లిన ఓ అమ్మాయి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అన్నదే ఈ సినిమా మెయిన్‌పాయింట్. గతంలో వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమా ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి.
‘జయ జయ జయజయహే’ సినిమా క్లైమాక్స్‌లో భార్యాభర్తలు కోర్టులో విడాకులు తీసుకుని విడిపోతారు. అయితే తెలుగు ఆడియన్స్‌కు మోస్ట్‌లీ సాడ్ ఎండింగ్స్ నచ్చవు కనుక…‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రంలో మంచి పాజిటివ్ ఎండ్ క్లైమాక్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఈ చిత్రంలో బ్రహ్మాజీ–గోపరాజు రమణల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు, హ్యూమర్ డైలాగ్స్ ఆడియన్స్‌ను అలరిస్తాయట. జై క్రిష్ మ్యూజిక్ కొత్తగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. అలాగే తెలుగు ఆడియన్స్‌కు కథలో నచ్చే, మెచ్చే కొన్ని మార్పులు చేర్పులు అయితే దర్శకుడు ఏఆర్ సజీవ్ చేసి నట్లుగా తెలుస్తుంది. టీజర్‌లో ఐపీఎల్ సీన్ ఒకటి ఇందుకు ఉదాహరణ. మరి..‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా రూపొందిన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ సినిమా తెలుగు రీమేక్ ఆడియన్స్‌ను ఎంతమేరకు అలరిస్తుందో చూడాలి.
ఈ సినిమా జనవరి 30న థియేటర్స్‌లో విడుదల అవుతుంది. నిడివి రెండు గంటల పదినిమిషాలు. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీ గా ఈ సినిమా చూడొచ్చు. టికెట్ రేట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
