మూడు భాగాలుగా యానిమల్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన హీరో!

Kumar NA

Web Stories

Animal Park: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సృష్టించిన ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రం 2023లో విడుదలై గ్లోబల్ స్థాయిలో రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా ముగింపులోనే సీక్వెల్‌కు సంబంధించిన హింట్ ఇచ్చిన మేకర్స్, ఇప్పుడు రెండో భాగం ‘యానిమల్ పార్క్’ (Animal Park) గురించి అధికారికంగా నోరు విప్పారు.

రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ కథ కేవలం రెండు భాగాలతో ముగిసేది కాదని స్పష్టం చేశారు. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ను ఒక పవర్‌ఫుల్ ఫ్రాంచైజీగా మార్చాలని నిర్ణయించుకున్నారని, ఈ కథ మొత్తం మూడు భాగాలుగా సాగుతుందని (Animal trilogy) రణబీర్ వెల్లడించారు.

రెండో భాగం ‘యానిమల్ పార్క్’లో రణబీర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. కథానాయకుడిగా మాత్రమే కాకుండా, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలోనూ ఆయనే కనిపించనున్నారు (Ranbir Kapoor upcoming movie). హీరో వర్సెస్ విలన్‌గా తనను తాను స్క్రీన్ పై చూసుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు రణబీర్ క్లారిటీ ఇచ్చారు. 2027లో ఈ చిత్ర షూటింగ్ పట్టాలెక్కనుంది (Animal movie sequel )

ప్రస్తుతం రణబీర్ తన పూర్తి సమయాన్ని నితేష్ తివారీ ‘రామాయణం’ సిరీస్‌కు కేటాయించారు. ఈ చిత్రంలోని మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. దీనితో పాటు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’ కూడా 2027లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా యానిమల్’ మొదటి భాగంలో రష్మికా మందన్నా, బాబీడియోల్, త్రిప్తి దిమ్రి తమ నటనతో ఆకట్టుకోగా, రెండో భాగంలో సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఇమేజినేషన్ ఎలా ఉంటుందోనని సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi