ఓటీటీలోకి ప్రభాస్ ‘ది రాజాసాబ్’.. ఎప్పుడంటే..?

Kumar NA

Web Stories

Prabhas TheRajasaab ott Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్–కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది (Prabhas TheRajasaab ott Release). థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన పొందిన ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ మూవీ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 6 (Prabhas The Raja Saab OTT release date) నుంచి ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందు బాటులోకి రానుంది (Prabhas The Raja Saab OTT release). ఈ చిత్రంలో ప్రభాస్‌ను కొత్తగా, వింటేజ్ స్టైల్‌లో చూపించారు.

ఓటీటీలో నారీ నారీ నడుమ మురారీ…స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..!

అతనితో పాటు సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే, ప్రభాస్ పోషించిన పాత్ర పేరు రాజు, అందరూ అతన్ని రాజాసాబ్ అని పిలుస్తారు. రాజుకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నది అతని నాయనమ్మ గంగాదేవి. ఆమెకు జ్ఞాపకశక్తి తగ్గించే ఆల్జీమర్స్ వ్యాధి ఉంటుంది. చాలా విషయాలు మరిచిపోతూ ఉన్నా, ఎప్పుడో తనను వదిలేసి వెళ్లిపోయిన భర్త కనకరాజును మాత్రం ఆమె మర్చిపోదు.తన తాత గురించి నిజాలు తెలుసుకోవాలనే తపనతో రాజు వెతకడం మొదలుపెడతాడు. ఆ క్రమంలో నర్సాపూర్ అడవుల్లో ఉన్న ఒక పాత రాజమహల్ గురించి తెలుసుకుంటాడు ( The Raja Saab OTT).

ఆ మహల్‌లో అడుగుపెట్టిన తర్వాత రాజు అనేక అనుకోని సంఘటనలను ఎదుర్కొంటాడు. అక్కడ అతనికి తన తాత కనకరాజు గురించి షాకింగ్ నిజాలు బయటపడతాయి.అలాగే గంగాదేవి గతం, కనకరాజు ఆమెను ఎందుకు వదిలేశాడు, అతని అసలు ఉద్దేశం ఏమిటి అన్న విషయాలు క్రమంగా బయటపడతాయి. ఈ అన్ని మిస్టరీల మధ్య, నాయనమ్మ కోసం రాజు చేసే పోరాటమే ఈ సినిమా కథగా నిలుస్తుంది ( The Raja Saab movie OTT update).

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi