Balakrishna new film: నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మలయాళంలో ‘మోస్ట్ వైలెంట్’ చిత్రంగా సంచలనం సృష్టించిన ‘మార్కో’ దర్శకుడు హనీఫ్ అదేని, ఇప్పుడు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణతో జతకట్టబోతున్నారు. ఊచకోత కోయడంలో ‘మార్కో’కు మించిన మాస్ యాక్షన్‌ను బాలయ్య కోసం సిద్ధం చేసినట్లు సమాచారం.మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన ‘మార్కో’ సినిమా ఏ రేంజ్ వైలెంట్ కంటెంట్‌తో వచ్చిందో అందరికీ తెలిసిందే (Balakrishna new film).
అదే తరహాలో బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే ఒక పక్కా మాస్ యాక్షన్ సబ్జెక్టును హనీఫ్ సిద్ధం చేశారట. రీసెంట్గా బాలయ్యను కలిసి కథ వినిపించగా, పాయింట్ నచ్చిన గాడ్ ఆఫ్ మాసెస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ మార్చి నుంచి మొదలై, 2027 సంక్రాంతికి విడుదల కానుంది (Telugucinema news). మరోవైపు ఈ దర్శకుడు ‘మార్కో 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని సినిమా పూర్తయ్యాక, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో హనీఫ్-బాలయ్య ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది (Balakrishna new film).
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలయ్య.. ‘మార్కో’ లాంటి వైలెంట్ దర్శకుడి చేతిలో పడితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తెరపై బాలయ్య చేసే విధ్వంసం ఈసారి పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.ఈ కాంబినేషన్ సెట్ అయితే బాలయ్య కెరీర్లోనే అత్యంత వైలెంట్ మూవీ ఇదే అవుతుందనడంలో సందేహం లేదు (Balakrishna new film).