ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన చిరంజీవి కూతురి పాత్ర కోసం ఒక టాలెంటెడ్ నటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎమోషనల్ పాత్ర కోసం చిత్ర బృందం చాలా మందిని పరిశీలించినా, చివరకు సారా అర్జున్ (Sara Arjun)వైపు మొగ్గు చూపారు.
‘పొన్నియిన్ సెల్వన్’లో తన నటనతో ఆకట్టుకున్న సారా, ఇటీవలే హిందీ చిత్రం ‘ధురంధర్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటన ఈ పాత్రకు ప్రాణం పోస్తాయని దర్శకుడు బాబీ నమ్ముతున్నారు. మొదట ఈ పాత్ర కోసం ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి పేరు గట్టిగానే వినిపించింది. అయితే, ఆమె నటించిన ఇటీవలి చిత్రాలు వరుసగా నిరాశ పరచడం, ముఖ్యంగా ‘వా వతియార్’ డిజాస్టర్ అవ్వడంతో మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. బాబీ చెప్పిన ఎమోషనల్ పాయింట్ నచ్చడంతో సారా అర్జున్ వెంటనే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పేసిందట.
మెగాస్టార్ మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు, తండ్రీకూతుళ్ల మధ్య సాగే బలమైన భావోద్వేగాలు ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతుండగా, త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.