సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..?

Kumar NA

Web Stories

Pawan Kalyan: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2027 సంక్రాంతి రేసు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే చిరు, వెంకటేష్ తమ స్థానాలను ఖరారు చేసుకోగా, బాలకృష్ణ, నాగార్జున కూడా ఈ పోటీలో నిలిచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అందరి దృష్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు మళ్లింది.

​దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ తాళ్లూరి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలపడంతో, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ ప్రణాళికకు పవన్ కూడా సానుకూలంగా స్పందించారు. 2027 జనవరి 12న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ రోజు మంగళవారం కావడం, పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవమైన హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ఈ తేదీని ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ముగింపు దశలో ఉన్నాయి.

ఉగాది పర్వదినాన సినిమాను అధికారికంగా ప్రారంభించి, చిత్రీకరణ మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలు లేదా ఇతర ఆటంకాలు ఎదురవ్వకుండా సకాలంలో షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి నాటికి సిద్ధం చేయాలనే లక్ష్యంతోనే నిర్మాత ఈ పనులను వేగవంతం చేశారు. సురేందర్ రెడ్డి సినిమాల్లో ఉండే భారీతనం, యాక్షన్ సన్నివేశాలు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తోడైతే, సంక్రాంతి బరిలో మాస్ ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా అనౌన్స్ మెంట్ రోజునే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos