please subscribe to Tollywoodhub YouTube channel

చైతూ 25 వ ప్రాజెక్ట్ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యిందా?

Kumar NA

Web Stories

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య తన కెరీర్‌లో అత్యంత కీలకమైన మైలురాయికి చేరువవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వృషకర్మ’ షూటింగ్ దశలో ఉండగా, అందరి దృష్టి ఇప్పుడు ఆయన 25వ సినిమాపైనే ఉంది. చైతూ సిల్వర్ జూబ్లీ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ చేస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే, ఈ సినిమా తర్వాత రాబోయే 25వ చిత్రం కోసం చైతూ ఒక ప్రత్యేకమైన ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. చైతూ 25వ సినిమా కోసం మొదట చాలా మంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ‘మజిలీ’ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాల్సి ఉంది. అయితే, స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. బాహుబలి నిర్మాతల సారథ్యంలో ఒక థ్రిల్లర్ కథపై చర్చలు జరిగాయి కానీ, అది కూడా సెట్ అవ్వలేదు. రీసెంట్‌గా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మాస్ మూవీ ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ, చైతూ ప్రస్తుతానికి మాస్ రూట్ కంటే తన బలాన్ని నమ్ముకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం, ‘బెదురులంక 2012’ చిత్రంతో తన మార్క్ చూపించిన దర్శకుడు క్లాక్స్ చెప్పిన కథకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘ఏమాయ చేసావే’, ‘ప్రేమమ్’, ‘మజిలీ’, ‘తండేల్’ వంటి ప్రేమకథా చిత్రాలే చైతన్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాయి. అందుకే తన 25వ మైలురాయి చిత్రం కోసం కూడా ఒక విభిన్నమైన లవ్ స్టోరీనే ఆయన ఎంచుకున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను బన్నీ వాసు నిర్మించబోతున్నారని, ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. తనకు అచ్చొచ్చిన ‘ప్రేమకథ’ రూట్‌లోనే వెళ్లి 25వ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని చైతూ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi