స్వయంభూ టీజర్.. యోధుడిగా అదరగొట్టిన నిఖిల్..!

Kumar NA
1 Min Read

Web Stories

Nikhil: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా ‘స్వయంభు’ (Nikhil Swayambhu Teaser) ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, ప్రేక్షకులను ఒక సరికొత్త చారిత్రక ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. రాజ్యాల మధ్య యుద్ధాలు, అద్భుతమైన విజువల్స్ మరియు నిఖిల్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. టీజర్‌లో వినిపించిన “కాలం కత్తై దూస్తే.. కాపాడే కవచం కావాలి కదా!” అంటూ సాగే సంభాషణలు సినిమాలోని గాంభీర్యాన్ని చాటిచెబుతున్నాయి. ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే గ్రామం, రాజ్యం ఎలా ప్రమాదంలో పడతాయో చెప్పే డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. ఇందులో సంయుక్త మీనన్ వీరనారిగా కత్తి పట్టి యుద్ధం చేస్తుండగా, నభా నటేష్ యువరాణిగా అలరించనుంది. ఇక కమెడియన్ సునీల్ ఒక వైవిధ్యమైన, గతంలో ఎన్నడూ చూడని పాత్రలో కనిపించబోతున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.

చారిత్రక నేపథ్యంతో సాగే ఈ పోరాట గాథలో నిఖిల్ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మీరు ఈ సినిమా టీజర్‌ను ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. టీజర్ చూస్తుంటే నిఖిల్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. స్వయంభూ సినిమా ఏప్రిల్‌ 10న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu