‘యూఫోరియా’ లో ఆ రోల్ చిరంజీవి చేయాల్సిందా?

Kumar NA
1 Min Read

Web Stories

Euphoria : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘చూడాలని ఉంది’. ఆ సినిమా అప్పట్లో సాంకేతికంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. వీరిద్దరి క్రేజీ కాంబో మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గుణశేఖర్ తన పంథాను మార్చుకుని తెరకెక్కించిన యూత్ ఫుల్ థ్రిల్లర్ ‘యుఫోరియా’ మూవీలో చిరంజీవి నటించాల్సి ఉందట.

గుణశేఖర్ ‘యుఫోరియా’ కథను సిద్ధం చేస్తున్నప్పుడు, అందులో కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట చిరంజీవినే సంప్రదించారట. గుణశేఖర్‌పై ఉన్న గౌరవంతో మెగాస్టార్ కూడా మొదట సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, చివరి నిమిషంలో చిరంజీవి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్లే చిరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

అవేంటంటే.. ప్రస్తుతం చిరంజీవి తన లైనప్‌లో వరుసగా భారీ మాస్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ సమయంలో ఇలాంటి అతిథి లేదా సహాయక పాత్రల్లో కనిపిస్తే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో అన్న సందిగ్ధత ఒకటైతే.. పూర్తిస్థాయి హీరోగా బిజీగా ఉన్న తరుణంలో, కథకు ప్రాధాన్య మున్న పాత్ర అయినప్పటికీ ఇమేజ్ రీత్యా అది సరైన సమయం కాదని ఆయన భావించి చిరు ఆ రోల్ ను సున్నితంగా తిరస్కరించారట. మెగాస్టార్ ఈ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత, ఆ పవర్ ఫుల్ పాత్రలోకి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ వచ్చి చేరారు. ఆయన తనదైన శైలిలో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు (Chiranjeevi in Euphoria Movie)

Please Share
Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu