యువతను ప్రోత్సహించేందు ప్రముఖ నిర్మాత–డిస్ట్రిబ్యూటర్ ‘దిల్’ రాజు ఇటీవల ‘దిల్ రాజు డ్రీమ్స్’ (అనే ఓ కొత్త బ్యానర్‌ను స్థాపించారు. ఈ నిర్మాణసంస్థలో తొలి ప్రయత్నంగా ‘మార్కండేయ’ (Markandeya Movie)అనే సినిమాను ప్రకటించి, ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాలో సిస్లా›్ట వీఎంకే దర్శకత్వం వహిస్తున్నారు. సంతాన ప్రాప్తిరస్థు ఫేమ్ విక్రాంత్ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. వచ్చే శివరాత్రి సందర్భంగా ఈ ‘మార్కెండేయ’ సినిమా రిలీజ్ కానుంది.
ఈ ఈవెంట్లో విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో ఫస్ట్ మూవీ కాబట్టి గుర్తుండిపోయేలా ఉండేలా ఈ సినిమాను అందిస్తాం. మార్కండేయుడి పాత్రకు మోడరన్ వెర్షన్ ఈ మూవీ. మార్కండేయుడికి ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు వస్తాయో అలాగే ఈ మార్కండేయుడికి వస్తాయి. ఆ పరమశివుడి దయతో ఆ సమస్యకు సమాధానాలు వెతికి ఆ చిక్కుల్లోంచి ఎలా బయటపడ్డాడు అనేది మూవీలో చూపిస్తున్నాం. ఈ చిత్రంలో సాంకేతికత కంటే హ్యూమన్ ఎమోషన్స్‌కే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ–‘‘ఈ మార్కండేయ మూవీ కోసం విక్రాంత్ నన్ను అప్రోచ్ అయ్యాడు. అతనికి బిజినెస్ లు ఉన్నాయి. అవన్నీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. హీరోగా కూడా సక్సెస్ కావాలనే తపన విక్రాంత్ లో కనిపించింది. మార్కండేయ మూవీలోని కంటెంట్ నచ్చి ఈ చిత్రాన్ని మా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో మొదటి చిత్రంగా టేకప్ చేశాం. సీజీ వర్క్ ఎక్కువగా ఉన్న చిత్రమిది. ఈ సినిమాను వచ్చే ఏడాది మహాశివరాత్రికి విడుదల చేస్తాం. మా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. వాటిలో రెండు ఓటీటీ, మరో రెండు థియేట్రికల్ గా రిలీజ్ అవుతాయి. దేశంలో కొత్త వాళ్ల కోసం ఇలాంటి బ్యానర్ మరొకటి లేదు. అది మాకు గర్వంగా ఉంది. మా బ్యానర్ అనౌన్స్అనౌన్స్ చేసినప్పుడు 330 స్క్రిప్ట్స్ వచ్చాయి. వాటిలో వంద మాత్రమే మా వాళ్లు చదవగలిగారు. వాటిలో ఐదారు మూవీస్ ఈ ఏడాది మా సంస్థ నుంచి వస్తాయి. నిర్మాతగా జర్నీ బిగిన్ చేసినప్పుడు కొత్త వాళ్లతో కొత్తదనం ఉన్న చిత్రాలు ఎలా చేశామో అలాగే దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో చిత్రాలు చేయాలను కుంటున్నాం. స్టార్స్ తో మా ఎస్వీసీలో సినిమాలు చేస్తున్నాం. అయితే మొదట్లో మేము చేసినట్లే స్క్రిప్ట్ సంతృప్తికరంగా వచ్చాక, దర్శకుడితో వేవ్ లెంగ్త్ కుదిరాక సినిమా అనౌన్స్ చేస్తాం చేస్తాం. ప్రస్తుతం ఎల్లమ్మ, రౌడీ జనార్థన, దేత్తడి మూడు సినిమాలు చేస్తున్నాం’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హరి ఎస్ఆర్ మాట్లాడుతూ – ముందుగా నా మెంటార్ తమన్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా సౌండ్ ట్రాక్ గ్లోబల్ గా పేరొస్తుందని నమ్ముతున్నాను. నాపై నమ్మకం పెట్టి అవకాశం ఇచ్చారు. ఈ మూవీకి స్క్రిప్ట్ బాగా కుదిరింది. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన చిత్రమిది. అన్నారు.
డైరెక్టర్ సిస్ట్లా వీఎంకే మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుగారు మాపై రాజు గారు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మేము ఈ సినిమాకు ఏఐని ఒక సపోర్ట్ గా వాడాం తప్ప ఏఐ నుంచి చేసిన షాట్స్ ఎక్కడా మూవీలో పెట్టలేదు. విక్రాంత్ నాకు మార్కండేయ, నేను ఆ పేరుతోనే పిలు స్తాను. ఈ మూవీ కోసం మా మధ్య ఎన్నో మంచి డిస్కష¯Œ ్స జరిగాయి. ఈ రోజు నుంచి విక్రాంత్ మీ అందరి మార్కండేయ అయిపోయారు’’ అని అన్నారు.