please subscribe to Tollywoodhub YouTube channel

చికిరి హుక్ స్టెప్ కంపోజ్ చేసింది జానీ మాస్టర్ కాదా? ఇదేం ట్విస్ట్..!

Kumar NA

Web Stories

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ ఇప్పటికే ఒక సెన్సేషన్‌గా మారి, యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా ఆ పాటలో చరణ్ క్రికెట్ బ్యాట్‌తో వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అయితే, ఈ ఐకానిక్ స్టెప్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు బయటకు వచ్చి అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినిమాల్లో డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కొరియోగ్రాఫర్స్ కంపోజ్ చేస్తారు.

ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో, ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందని అందరూ భావించారు. కానీ, తాజాగా ఒక డ్యాన్స్ షోలో జానీ మాస్టర్ స్వయంగా అసలు విషయం వెల్లడించారు.’ పాటలో చరణ్ కూర్చుని లేచే స్టెప్‌ను జానీ మాస్టర్ డిజైన్ చేయగా, ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకుని చేసే హుక్ స్టెప్ మాత్రం స్వయంగా రామ్ చరణ్ ఇచ్చిన ఐడియా’ అని ఆయన తెలిపారు. తన ఐడియా అయినప్పటికీ, దానిని వెండితెరపై అంత అందంగా చూపించినందుకు ఆ క్రెడిట్ మొత్తం కొరియోగ్రాఫర్‌కే దక్కాలని చరణ్ అన్నారట. “ఐడియా నాదైనా, దాన్ని నమ్మి బెటర్‌గా ఎగ్జిక్యూట్ చేసింది మీరే కదా” అంటూ చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నారు.

రామ్ చరణ్ కేవలం అద్భుతమైన డ్యాన్సర్ మాత్రమే కాదు, తన పాటలకు కావాల్సిన క్రేజీ మూమెంట్స్‌ను స్వయంగా క్రియేట్ చేయగల సృజనాత్మకత కూడా ఆయనలో ఉందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. “మెగా పవర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకపక్క గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ఉన్నా, చిన్న విషయాన్ని కూడా తన టీమ్‌కు క్రెడిట్ ఇచ్చే చరణ్ వ్యక్తిత్వం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi