please subscribe to Tollywoodhub YouTube channel

సితార జమీన్‌ పర్‌..స్పానిష్‌ మూవీ హిందీ రీమేక్‌

Viswa
1 Min Read
Aamirkhan Sitaare ZameenPar movie poster

Web Stories

సోలో హీరోగా ఆమిర్‌ఖాన్‌ సినిమా విడుదలై మూడేళ్లుపైనే అవుతుంది. ఆమిర్‌ఖాన్‌ లాస్ట్‌ మూవీ ‘లాల్‌సింగ్‌చద్దా’ చిత్రం ఓ ఫ్లాప్‌ మూవీగా నిలిచింది. ఇంగ్లీష్‌ ఫిల్మ్‌ ది ఫారెస్ట్‌ గంప్‌కు ఇది హిందీ రీమేక్‌. మళ్లీ మూడు సంవత్సరాల తరవాత మరో రీమేక్‌తో ఆమిర్‌ఖాన్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు (Aamirkhan Sitaare ZameenPar trailer)

Aamirkhan Sitaare ZameenPar trailer: స్పానిష్‌ ఫిల్మ్‌ ఛాంపియన్‌కు హిందీ రీమేక్‌

Aamirkhan Sitaare ZameenPar movie Working Still
Aamirkhan Sitaare ZameenPar movie Working Still

ఆమీర్‌ఖాన్‌ హీరోగా చేసిన ‘తారే జమీన్‌ పర్‌’ మూవీ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ గానే, ‘సితారే జమీన్‌ పర్‌’ (Aamirkhan Sitaare ZameenPar trailer) సినిమాను తీస్తున్నాడు ఆమిర్‌ఖాన్‌. ఈ సినిమాకు ఆర్‌ఎస్‌ ప్రసన్న డైరెక్టర్‌. ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించి, నిర్మించారు. జెనీలియా హీరోయిన్‌. ఈ ‘సితారే జమీన్‌ పర్‌’ మూవీ ఈ జూన్‌ 20న విడుదల కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ ఆసక్తికరంగానే ఉంది. అయితే స్పానిష్‌ ఫిల్మ్‌ ‘ఛాంపియన్‌’ సినిమాకు హిందీ రీమేక్‌లా కనిపిస్తోంది ‘సితారే జమీన్‌ పర్‌’ మూవీ. ఇంగ్లీష్‌ మూవీ ‘లాల్‌సింగ్‌ చద్దా’తో దెబ్బతిన్న ఆమిర్‌ఖాన్‌..మరి. ఈ స్పానిష్‌ మూవీ ‘చాంపియన్‌’ హిందీ రీమేక్‌ ‘సితారే జమీన్‌ పర్‌’తో నైనా కోలుకుంటాడో లేదో చూడాలి.

రాజ్‌కుమార్‌ హిరాణితో సినిమా?

ఆమిర్‌ఖాన్ (Aamir khan), రాజ్‌కుమార్‌ హిరాణి (Rajkumar hirani)ల కాంబినేషన్‌లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్, పీకే’ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. హిందీలో ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అయితే మళ్లీ వీరిద్దరి కలిసి సినిమా చేయనున్నారనే టాక్‌ బాలీవుడ్‌లో బలంగా వినిస్తోంది. బహుశా..ఆమిర్‌ఖాన్‌ నెక్ట్స్‌ ఫిల్మ్‌ రాజ్‌కుమార్‌ హిరాణితోనే ఉండొచ్చు.

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi