స్పిరిట్‌..మరో యాక్టర్‌ అవుట్‌?

Viswa

Web Stories

‘అర్జున్‌రెడ్డి, యానిమల్‌’ వంటి సూపర్‌హిట్‌ మూవీస్‌ తీసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న తాజా సినిమా ‘స్పిరిట్‌’ (Spirit Movie ). ఇందులో ప్రభాస్‌ హీరో. త్రిప్తి దిమ్రి హీరోయిన్‌. కాంచన, ప్రకాష్‌రాజ్, వివేక్‌ ఓబెరాయ్‌ ఇతర ప్రధాన పాత్రధారులు.

గత ఏడాది ప్రభాస్‌ ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భంగా ‘స్పిరిట్‌’ సినిమా సౌండ్‌స్టోరీ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌ స్పష్టం వినిపించింది. ఈ స్పిరిట్‌ మూవీలో ప్రభాస్‌ది ఐపీఎస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర కాగా, ప్రకాష్‌రాజ్‌ ఓ జైలర్‌ రోల్‌ చేస్తున్నారని తెలిసింది.

అంతేకాదు..మూవీలో ప్రకాష్‌రాజ్‌– ప్రభాస్‌ తండ్రీకొడుకులుగా కనిపిస్తారట. ఆల్రెడీ షూటిం గ్‌ మొదలైంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడ బయటకు వచ్చింది. మార్చి 5న రిలీజ్‌ అంటూ రిలీజ్‌ డేట్‌ కూడ ప్రకటించారు. కాకపోతే..కొన్ని క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా, ఈ సినిమా నుంచి ప్రకాష్‌రాజ్‌ తప్పుకున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి.

గతంలో ‘స్పిరిట్‌’లోని హీరోయిన్‌ పాత్రకు మేకర్స్‌ దీపికా పదుకొనెను అనుకున్నారు. కానీ ఆమె ప్లేస్‌లో త్రిప్తి దిమ్రీ ఫైనల్‌ అయ్యారు. ఇప్పుడు ప్రకాష్‌రాజ్‌ తప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి..ప్రకాష్‌రాజ్‌ ప్లేస్‌లోకి ఎవరొస్తారో చూడాలి. అయితే ఇలాంటి సంఘటనలు ‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌పై ప్రభావం చూపిస్తాయని ఊహించవచ్చు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi