లెనిన్‌ మళ్లీ వాయిదా…కొత్త విడుదల తేదీ ఎప్పుడుంటే…!

Viswa
1 Min Read

Web Stories

Akhil Lenin Postponed Again: అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘లెనిన్‌’ సినిమా  (Lenin Movie Postponed) విడుదల వాయిదా పడింది. ‘లెనిన్‌’ సినిమాను మేకర్స్‌ తొలుత ఈ ఏడాది మార్చి చివర్లో రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే1కి వాయిదా వేశారు. ఇటీవల జూన్‌ 26కి వాయిదా వేశారు. తాజా మళ్లీ ‘లెనిన్‌’ రిలీజ్‌ డేట్‌ మారింది. ‘లెనిన్‌’ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రక టించారు. మంచి క్వాలిటీ అవుట్‌పుట్‌ రావడం కోసం మరింత సమయం కావాలని ‘లెనిన్‌’ టీమ్‌ తనను అభ్వర్థించిందని, వాళ్ల పట్టుదల, కసి చూసి కాదనలేకపోయానని ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన నాగార్జున చెప్పారు. అలాగే ‘లెనిన్‌’ సినిమా జూలై10న రిలీజ్‌ కానున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటించారు నాగార్జున.

అఖిల్‌, భాగ్యశ్రీబోర్సే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ‘లెనిన్‌’ సినిమాకు మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, నాగార్జున నిర్మిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో సాగే, ఈ యాక్షన్‌ లవ్‌స్టోరీ సినిమాలో శివాజీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ‘ఏజెంట్‌’ వంటి ప్లాఫ్‌ మూవీ తర్వాత, అఖిల్‌ నుంచి రాబోతున్న ఈ ‘లెనిన్‌’ సినిమా అఖిల్‌ కెరీర్‌కు ఎంతో కీలకమైనది. మరి..ఏం జరుగుతుందో చూడాలి.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi