సూర్య కథ బన్నీకి వెళ్లిందా!

Viswa
AlluArjun Film With Director Basil Josef

Web Stories

బాసిల్‌ జోసెఫ్‌ మలయాళ నటుడిగానే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ‘సూక్ష్మదర్శిని, పొన్‌ మ్యాన్,జయజయజయజయహే’ వంటి సినిమాలతో బాసిల్‌ జోసెఫ్‌ (Basil Joseph) నటుడిగా తెలుగు ఆడియన్స్‌కు దగ్గర అయ్యారు. కానీ బాసిల్‌ జోసెఫ్‌ మంచి దర్శకుడు. మలయాళంలో టోవినోథామస్‌ హీరోగా చేసిన సూపర్‌హీరో మూవీ ‘మిన్నల్‌ మురళి’ సినిమాకు బాసిల్‌ జోసెఫ్‌యే దర్శకుడు. అప్పట్లో కరోనా సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మూవీ తర్వాత బాసిల్‌ కాస్త నటుడిగా బిజీ అయ్యారు. మళ్లీ ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్‌ కథను బాసిల్‌ జోసెఫ్‌ రెడీ చేశాడు.

ఈ సినిమాను సూర్యతో చేయాలనుకున్నాడు బాసిల్‌ జోసెఫ్‌. ఓ దశలో అధికారిక అనౌన్స్‌ మెంట్‌ కూడా రావాల్సింది. ‘కంగువ’ సినిమా రిజల్ట్‌ తేడా కొట్టడంతో, బాసిల్‌ జోసెఫ్‌ మూవీ కథపై సూర్య (Suriya)  కాస్త వెనక్కి తగ్గారట. అయితే ఇప్పుడు ఇదే కథను అల్లు అర్జున్‌తో చేయడానికి బాసిల్‌ జోసెఫ్‌ సిద్ధమైయ్యాడట. నిజానికి ఈ కథను అల్లు అర్జున్‌ (AlluArjun)  కోసమే బాసిల్‌ జోసెఫ్‌ రెడీ చేశాడట. కానీ ‘పుష్ప: ది రూల్‌’ సినిమా, ఆ నెక్ట్స్‌ త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి వంగాలతో అల్లు అర్జున్‌ వరుస లైనప్‌ ఉండటంతో, బాసిల్‌ ఈ కథను సూర్యకు చెప్పారట. అయితే బన్నీ లైనప్‌ మారడంతో అల్లు అర్జున్‌తోనే ఈ సినిమా చేసేందుకు జోసెఫ్‌ రెడీ అవుతున్నారని టాక్‌. కానీ ప్రజెంట్‌ అట్లీతో మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్‌. ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌ – బాసిల్‌ జోసెఫ్‌ల ప్రాజెక్ట్‌పై  (AlluArjun Basil Joseph) ఓ ప్రకటన ఉండొచ్చు. వచ్చే ఏడాది అల్లు అర్జున్‌ బర్త్‌ డే ఏప్రిల్‌ లో ఉంటుంది. ఆ సమయానికి ఈ సినిమా అధికారిక ప్రకటన రావొచ్చు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi