లోకేష్‌కనగరాజ్‌తో అనుష్కాశెట్టి?

Viswa
AanushkaShetty 2025 in Kaithi2

Web Stories

తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో అనుష్కాశెట్టి నటించనున్నారనే (Anushkashetty Kaithi2) టాక్‌ కోలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. కానీ ట్విస్ట్‌ ఏంటంటే.. ఇదెదో ఉమెన్‌సెంట్రిక్‌ ఫిల్మ్‌ కాదు.. లోకేష్‌ సిని మాటిక్‌ యూనివర్స్‌లో స్టాండ్‌ఎలోన్‌ ఫిల్మ్‌ కూడా కాదు. ‘ఖైదీ 2’లో అనుష్కాశెట్టి (Anushkashetty) యాక్ట్‌ చేయనున్నారట.

కార్తితో ‘ఖైదీ’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ (LokeshKanagaRaj). ఈ సినిమాకు సీక్వెల్‌ తీయాలని ఎప్పట్నుంచో ప్లాన్‌ చేస్తున్నారు. కానీ పరిస్థితులు కలిసి రావ డం లేదు. మొత్తానికి అన్నీ కుదిరి, ఈ ఏడాదిలో ‘ఖైదీ 2’ (Kaithi2) సినిమా సెట్స్‌కు వెళ్తుంది. అయితే ఈ సినిమాలో కార్తీ భార్య పాత్రలో అనుష్కాశెట్టి కనిపించనున్నారట. ‘ఖైదీ’ సినిమాలో దిల్లీ పాత్రలో కార్తీని చూపించారు కానీ, ఆ దిల్లీ పాత్ర భార్యను చూపించలేదు. దీంతో ఈ పాత్రలోనే అనుష్కాశెట్టి కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. మరి..ప్రచారంలో ఉన్నట్లుగానే ఇది నిజం అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

మరోవైపు సూర్య హీరోగా చేసిన ‘సింగమ్‌ 2, సింగమ్‌ 3’ సినిమాల్లో అనుష్కాశెట్టి హీరో యిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూర్య తమ్ముడు కార్తికి జోడీగా అనుష్కా శెట్టి అంటే…ఇది కాస్త ఆసక్తికరమైన అంశమే అని చెప్పుకోవచ్చు.

మరోవైపు అనుష్కాశెట్టి లీడ్‌ రోల్‌ చేసిన ‘ఘాటి’ సినిమా జూలై 11న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అలాగే మలయాళంలో ‘కథనార్‌’ (Kadhanar movie)  అనే సినిమాలో కూడా నటిస్తున్నారు అనుష్కాశెట్టి. ఈ హారర్‌ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi