మెగాస్టార్ చిరంజీవి వరుసగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో, అంతకంటే ముందే దర్శకుడు బాబీ ప్రాజెక్ట్ (మెగా 158) పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ స్టార్ క్యాస్టింగ్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి భార్య పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి నటించబోతున్నారట. గతంలో నాగార్జున, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ల సరసన నటించిన ప్రియమణి.. తన సుదీర్ఘ కెరీర్‌లో చిరంజీవితో కలిసి పని చేయడం ఇదే తొలిసారి.
సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతుంది ప్రియమణి.. ఇక ఎట్టకేలకు ఆమెకు మెగాస్టార్‌తో జతకట్టే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ప్రధానంగా తండ్రి, కుమార్తె మధ్య ఉండే బలమైన భావోద్వేగాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ కీలకమైన పాత్ర కోసం ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టిని చిత్ర బృందం సంప్రదించిందట. చిరు – కృతి మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలైట్ అని తెలుస్తోంది. సినిమాలో మరో వెయిటేజ్ ఉన్న పాత్రలో మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ కనిపించబోతున్నారని ఫిలిం నగర్ టాక్.
అదే నిజమైతే ఈ సినిమా రేంజ్ పాన్-ఇండియా లెవల్‌కు వెళ్లడం ఖాయం. ప్రస్తుతం బాబీ టీమ్ ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి మాస్ హిట్ తర్వాత చిరు – బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ ఈసారి కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, స్టార్ కాస్ట్ తో బలమైన ఎమోషనల్ కథను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.