సినిమా: కుబేర (kubera telugu review)
ప్రధాన తారాగణం: నాగార్జున, ధనుష్, రష్మికా మందన్నా, జిమ్ సర్భ్, దలీప్ తాహిల్ (kubera cast and crew)
దర్శకుడు: శేఖర్ కమ్ముల (Kubera Movie director)
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కెమెరా: నికేత్ బొమ్మిరెడ్డి
నిడివి: 3 గంటల 2 నిమిషాలు
రేటింగ్:. 3.0/ 5.0
నాగార్జున, ధనుష్‌లు కలిసి యాక్ట్ చేసిన ‘కుబేర’ సినిమాపై అంచనాలు తప్పక ఉంటాయి. పైగా ఈ సిని మాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడంతో ‘కుబేర’ (kubera review) సినిమాపై ఆడియన్స్‌కు మరింత ఆసక్తి కలిగింది. రష్మిక మందన్నా, జిమ్‌సర్భ్..వంటి నటీనటుల క్యాస్టింగ్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్…ఇలా అన్నీ ‘కుబేర’ సినిమా బాగా సెట్ అయ్యాయి. రూ. 100 కోట్ల రూపాయాలకు పైగా బడ్జెట్‌తో ‘కుబేర’ సినిమాను తీశారు మేకర్స్. ‘కుబేర’ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అయితే… ఆడి యన్స్‌ను ఏట్రాక్ట్ చేశాయి. మరి..సినిమా కూడా ఆడియన్స్ అంచాలను అందుకుందా? రివ్యూలో చది వేద్దాం.
kubera telugu review:కథ
గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ నీరజ్ మిత్ర (జిమ్ సర్బ్) ప్రపంచంలోనే టాప్ రిచేస్ట్ మ్యాన్ అవ్వాలని లక్ష్యం గా పెట్టుకుంటాడు. ఇందుకు ఆపరేషన్ సాగర్ ప్రాజెక్ట్ ను వినియోగించుకోవలనుకుంటాడు. రాజకీయ నాయకుడు సిద్ధాప్ప తో లక్ష కోట్ల రూపాయల డీల్ మాట్లాడతాడు నీరజ్. అయితే… 50 వేల కోట్ల రూపాయలను బ్లాక్ లో ఇవ్వాలని, మరో 50 వేల కోట్లను వైట్ లో ఇవ్వాలని నిరజ్ కు సిద్దప్ప కండిషన్ పెడతాడు. తన పని సక్రమంగా సాగడానికి, జైల్లో ఉన్న మాజీ సీబిఐ ఆఫీసర్ దీపక్ సాయం తీసుకొని, అతన్ని జైలు నుంచి విడిపిస్తాడు నీరజ్. ఇందుకు తన దగ్గర పని చేయాలని కండిషన్ పెడతాడు. అవినీతి పని చేసేందుకు దీపక్ ఒప్పుకుంటాడు.
ముందుగా 50 వేల కోట్ల బ్లాక్ మనీ ని, ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాడు దీపక్. ఈ పనికి నలుగురు బిచ్చ గాళ్ళను ఎంపిక చేసి, వాళ్ళ పేరిట ఫేక్ కంపెనీ లు సృట్టించి, బ్యాంకు అకౌంట్స్ ఓపెన్ చేసి, ఆ అకౌంట్స్ ద్వారా బ్లాక్ మనీ ని ట్రాన్స్ఫర్ అయ్యేలా ప్లాన్ చేస్తారు దీపక్ అండ్ నీరజ్. పని పూర్తి అయిపోయిన తర్వాత ఆ నలుగురు బిచ్చగాళ్ళను చంపాలను కుంంటాడు నీరజ్. కానీ ఆ బిచ్చగళ్ళలో ఒక్కడైన దేవ తప్పించుకుంటాడు. నీరజ్ అండ్ గ్యాంగ్… దేవా కోసం సెర్చ్ స్టార్ట్ చేస్తారు. మరి… నీరజ్ గ్యాంగ్ కి దేవా దొరుకుతాడా? దేవాకు తన లైఫ్ లో దీపక్ నుంచి ఏమైనా హెల్ప్ లభిస్తుందా? దేవా లైఫ్ లోకి సమీరా (రష్మిక మందన్న) ఎలా వచ్చింది? నిరజ్ మిత్ర లక్ష్యం నెరవేరిందా? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ
‘యుగాలనుండి జరుగుతున్న కథ.. యుగంతమైన మారిపోని కథ…’. ‘పేదల నేతుట్టి మరకలు అంటని పెద్దల సిరి ఉందా…’ అనే లైన్ ఈ సినిమా లోని ‘అనగనగ ఒక కథ..’ అనే పాట లో ఉంది…సింపుల్ గా కుబేర సినిమా స్టోరీ లైన్. (Kubera movie review ).

ధనవంతుల అత్యాశ కి, పేదల ఆకలికి మధ్య జరిగే సంఘర్షణ ను ‘కుబేర’ సినిమా గా చక్కగా చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. సమాజంలో ధనవంతులు, పెదలు, మధ్య తరగతి జీవితాలను చూపించారు. స్క్రీన్ ప్లే బాగుంది. చైతన్య పింగళి తో కలిసి… శేఖర్ కమ్ముల మంచి కథ రాసారు. సెకండ్ హాఫ్ లో… నాగ్ – రష్మిక ల మధ్య సెకండ్ హాఫ్ వచ్చే ఓ సీన్… ఆలోచన రేకేతించేలా ఉంటుంది. బెగ్గింగ్ వ్యవస్థ, బినామీ వ్యవస్థ, బ్లాక్ మనీ ట్రేండింగ్… వంటి విషయాలను చక్కగా డీల్ చేశారు.
నిరజ్ అండ్ గ్యాంగ్ బెగ్గర్స్ ని ఎంపిక చేయడం, తప్పుడు పనులకు వాళ్ళ పేర్లను వాడుకోవడం, దేవా తప్పించుకొవడం వంటి సీన్స్ తో తొలి భాగం ముగుస్తుంది. నీరజ్ గ్యాంగ్.. దేవాను వెతుకు లాడే సీన్స్ తోనే సెకండ్ హాఫ్ కంటిన్యూ అవుతుంది. తన పేరు పై పది వేల కోట్లు ఉన్నాయని దేవా తెలుసుకుని, ఆ డబ్బును తన లాంటి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలను కోవడం తో కథ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే నాలుగైదు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా.. దేవా – ఖుష్, దేవా – దీపక్ ల సంభాషణ లు, సీన్స్ మెప్పిస్తాయి. కన్నీళ్లు తెపిస్తాయి. కొన్ని ఊహత్మక సన్ని వేశాలు ఉన్నాయి. (మన ఇద్దరికీ అమ్మ లేదు ). క్లైమాక్స్ మెప్పిస్తుంది.టైటిల్ జస్టిఫికేషన్ బాగుంది. (kubera movie review)
Kubera movie Cast and Crew :నటి నటుల పెర్ఫార్మన్స్..
బిచ్చగాడు దేవా గా ధనుష్ (Dhanush) యాక్టింగ్ గురుంచి ఇంత చెప్పినా తక్కువే. దేవా పాత్రకు ప్రాణం పోసాడు. నేషనల్ అవార్డు లెవల్ యాక్టింగ్ చేశాడు. ఈ సినిమా కు ధనుష్ కు నేషనల్ అవార్డు రావచ్చు. సినిమా లో ధనుష్.. అమ్మ అని అడుక్కోవడం, రష్మిక వెనకాల ‘మేడమ్.. అక్క.. ‘అని తిరగడం ఆడియన్స్ కు భలేగా అనిపిస్తుంది. అదే సమయం లో ధనుష్… తాను బెగ్గింగ్ చేసి, చిన్నారులకు సాయం చేసే సీన్, ఆకలి వేస్తున్నా… కళ్ల ముందు భోజనం ఉన్న నీరజ్ గ్యాంగ్ కి దొరక కుండా, అ భోజనం కడుపారా తినకుండా నీటిలో దూకే సీన్ ఎమోషనల్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో ధనుష్ యాక్టింగ్ బాగుంది.ఎక్కడా ధనుష్ ఇమేజ్, హీరోయిజం జోలికి పోకుండా సీన్స్‌కు దేవా క్యారెక్టర్‌కు తగ్గట్లు చేయడం బాగుంది.
చేస్తున్న పని తప్పని తెలిసినా, కుటుంబం కోసం తప్పక చేయాల్సిన సంఘర్షణ తో కూడిన దీపక్ తేజ్ పాత్రలో నాగార్జున (Nagarjuna) సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. చిన్నపాటి నెగటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ సీన్స్ ఎమోషనల్ యాక్టింగ్ చూపించాడు. ఎంతో మదన పడే పాత్రలో నాగార్జున తన యాక్టింగ్ అనుభవాణ్ణి చూపించారు.
అత్యాశ పరుడైన నీరజ్ మిత్ర గా జిమ్ సర్బ్ (kuera movie villain Jim Sarbh)యాక్టింగ్ బాగుంది. కానీ స్క్రీన్ పై ఈ పాత్ర నిడివి తక్కువ ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో ఇంకా మంచి ఇంపార్టెన్స్ ఉంది.
లవ్ బ్రేక్ అప్ అయిన సమీరా పాత్ర లో రష్మిక మందన్న (kubera heroine Rashmikamandhanna) యాక్ట్ చేశారు. మంచి యాక్టింగ్ కనబరచారు. ధనుష్ తో రష్మిక ట్రాక్ ఒకే. ఈ ట్రాక్ సాగదీత ల అనిపిస్తుంది. కథ ను మలుపు తిప్పే షార్ట్ రోల్ లో పోలీస్ ఆఫసర్ గా షయాజీ షిండే యాక్ట్ చేశాడు.
దీపక్ తేజ్.. వైఫ్ శిల్పా పాత్ర లో సునయన కధలో ఉన్న పాత్ర పరిధి మేరకు కనిపించారు. హరీష్, దలిప్ తహిల్, ప్రీయాన్స్, రవి శర్మ, హరీష్…. వారి వారి పాత్రలా మేరకు యాక్ట్ చేశారు.
సునీల్ నారంగ్, రామ్మోహన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవి మ్యూజిక్ ఈ సినిమా కి ప్రధాన బలం. ఆర్ ఆర్ కుమ్మి పడేసాడు. తొలి భాగం లో వచ్చే ‘ నా కొడుకా, అనగనగ కథ, నాది నాది సాంగ్( నీరజ్ వెర్షన్ ) సాంగ్స్, ఆర్ఆర్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చిత్తకోట్టేసాడు. సెకండ్ హాఫ్ లోనూ దేవి మ్యూజిక్ మార్క్ కనిపిస్తుంది. ‘పోయి రా పోయి రా మావ’ సాంగ్ తెరపై బాగుంది. ‘నాది నాది సాంగ్…’మాది మాది..’ సాంగ్ వెర్షన్స్ బాగా వినిపించాయి. విజువల్స్ సూపర్. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు.
ఫైనల్ గా… : బెగ్గర్ వెర్సెస్ బిలియనీర్