please subscribe to Tollywoodhub YouTube channel

విజయశాంతిగారు వణికిపోయారు!

Director PradeepChilukuri: కళ్యాణ్‌రామ్‌ హీరోగా చేసిన 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' మూవీ దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఇంటర్వ్యూ

Viswa
2 Min Read

Web Stories

కళ్యాణ్‌రామ్‌ హీరోగా, విజయశాంతి మరో మెయిన్‌ లీడ్‌ రోల్‌లో యాక్ట్‌ చేసిన ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమా ఈ నెల 18న విడుదల అవు తుంది. సునీల్‌ బలుసు, అశోక్‌ వర్దన్‌ నిర్మించిన ఈ ఎమోషనల్‌ యాక్ష న్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ రిలీజ్‌ సందర్భంగా ఈ చిత్రం దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి (Director PradeepChilukuri) చెప్పిన సంగతులు…

కథ ఏంటి?

మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన బర్త్‌ డేలను సెలబ్రేట్‌ చేయడం వారికి ఒక ఎమోషన్‌. అలాగే మన తల్లిదండ్రుల బర్త్‌ డేలను గుర్తుపెట్టుకుని, మనం పెద్దవాళ్ళం అయ్యాక..సెలబ్రేట్‌ చేయడం కూడా ఎమోషనే. అదే ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమా కథ.

 

యూపీపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యే స్టూడెంట్‌ అర్జున్‌ (కల్యాణ్‌రామ్‌). అతని తల్లి ఐపీఎస్‌ ఆఫీసర్‌ వైజయంతి (విజయశాంతి). ఓ సందర్భంగా వీళ్లద్దరికీ ఓ కాన్‌ఫ్లిక్ట్‌ ఎదరవుతుంది. అర్జున్‌ క్రిమినల్‌ అవుతాడు. ఎవరి ఐడియాలజీలో వాళ్లు కరెక్ట్‌. దీంతో వీరి మధ్య ప్రాబ్లమ్స్‌ వస్తాయి. విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సోహైల్‌ఖాన్‌ యాక్ట్‌ చేశాడు. పృథ్వీరాజ్‌ మరో కీలక పాత్రలో చేస్తారు. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌లు అద్భుతంగా వచ్చాయి.

కల్యాణ్‌రామ్‌ రోల్‌ మంచి ఎమోషనల్‌గా ఉంటుంది!

అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి మూవీలోని మదర్‌ క్యారెక్టర్‌ను విజయశాంతిగారు చేస్తేనే, ఈ సినిమా చేద్దామని కల్యాణ్‌రామ్‌గారు స్పష్టంగా చెప్పారు. దీంతో విజయశాంతిగారిని అప్రోచ్‌ అయ్యి, కథ చెప్పగా ఆమె కొన్ని మార్పులు చెప్పి, ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా బలం ఎమోషనే.

కల్యాణ్‌రామ్‌గారి ‘అతనొక్కడే, పటాస్‌’ చిత్రాల్లో మంచి ఎమోషన్‌ ఉంటుంది. ఆ ఎమోషన్‌ ఈ మూవీలో కూడా ఉంటుంది. కల్యాణ్‌రామ్‌గారి ప్రధానబలం ఎమోషనే. విజయశాంతిగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సొంతంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేశారు. ఫారెస్ట్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీయాల్సి ఉంది. ఆ సమయంలో ఆమె బురదలో ఉండాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటలు. సన్నివేశం తర్వాత నేను విజయ శాంతిగారి క్యారవ్యాన్‌ దగ్గరకు వెళ్లాను. ఆమె జ్వరంతో వణికిపోతున్నారు. అయినా.. విజయ శాంతిగారు సీన్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాతే ఇంటికి వెళ్లారు.

రెండు సినిమాలు ఆగిపోయాయి!

నా డైరెక్షన్‌లోని తొలి సినిమా ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా ఆడలేదు. ఈ సినిమా ఆడదని అవుట్‌పుట్‌ చూసుకున్నప్పుడే నాకు అర్థమైంది. కానీ ఏం చేయలేను. ఆ తర్వాత పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు రెండు అవకాశాలు వచ్చాయి. కానీ అవి వర్కౌట్‌ కాలేదు. ఇలా దర్శకుడిగా దాదాపు పదేళ్ల గ్యాప్‌ వచ్చింది. కొన్ని కొంత విషయాలు నేర్చుకున్నాను.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi