Director Prasanth Varma in trouble: ‘హను–మాన్’ సక్సెస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయారు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఈ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో దర్శ కుడిగా సినిమా చేస్తానంటూ ఐదారుగురు నిర్మాత దగ్గర అడ్వాన్స్‌లపు పుచ్చుకున్నారట ప్రశాంత్‌వర్మ. ఈ అడ్వాన్స్ డబ్బులను, ప్రశాంత్ వర్మ తన కొత్త స్టూడియో నిర్మాణంపై పెట్టుబడి పెట్టారని వినికిడి. ఈ స్టూడియోలోనే ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోని సినిమాల పనులు జరుగుతున్నాయట.
మరోవైపు అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు సినిమా చేయాల్సిందిగా ప్రశాంత్‌వర్మను (Director Prasanth Varma) అడుగు తున్నారు. లేకపోతే అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని ప్రశాంత్‌కు చెబుతున్నారు. ఇందుకు ప్రశాంత్ వర్మ ఓ పరిష్కార మార్గాన్ని కనిపెట్టారు. తాను దర్శకత్వం వహించలేను కానీ, కథ అందిస్తా, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తానంటూ, అడ్వాన్స్‌లు తీసుకున్న నిర్మాతల దగ్గర చెబుతున్నారట. కానీ ప్రశాంత్ వర్మ పరిష్కార మార్గం నిర్మాతలకు నచ్చడం లేదట. దర్శకుడిగా సినిమా చేయమని అడ్వాన్స్‌లు ఇస్తే, ఇప్పుడు మరోకరు దర్శకత్వం వహిస్తారని ప్రశాంత్ వర్మ బదులు చెప్పడం, నిర్మాతలకు కోపం తెప్పిస్తుందట. దీంతో తెలుగు ఫిల్మ్ చాంబర్, డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రశాంత్‌వర్మపై ఫిర్యాదులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ, మీడియాలో వార్తలు వస్తున్నాయి.
హోంబలే ఫిల్మ్స్, మైత్రీమూవీమేకర్స్, సుధాకర్ చెరుకూరి..ఇలా ప్రముఖ నిర్మాతల దగ్గర ప్రశాంత్ వర్మ అడ్వాన్స్‌లు తీసుకున్నారట. మరి..తన కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇలాంటి సిట్చ్యూ వేషన్‌ను ప్రశాంత్‌వర్మ ఎలా డీల్ చేస్తారు? ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కుతారు? అనేది చూడాలి.ప్రభాస్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్‌శెట్టి…లతో ప్రశాంత్‌వర్మ సినిమాలు చేయనున్నారని వార్తలు వస్తున్న ఈ తరుణంలో, ఆయన ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారన్న టాపిక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
⚡ Test reactions in Vex Hyper Dash—dash, wall-jump, and rhythm resets on a lean, classroom-ready unblocked platformer; S-rank every stage and share your total time.
сервисный центр hp сервисный центр hp.