ఎన్టీఆర్ బర్త్ డే కి డబుల్ ట్రీట్.. ఫ్యాన్స్ కి పండగే!

Kumar NA

Web Stories

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను మొదలుపెట్టబోతున్నారు. ‘వార్ 2’ తర్వాత తారక్ ప్లాన్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులు చూస్తుంటే ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. మే 20న తారక్ పుట్టినరోజు కావడంతో, అభిమానుల కోసం ఒక రోజు ముందే అంటే మే 19న భారీ సర్ ప్రైజ్‌లు ఇచ్చేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ జార్జియాలో శరవేగంగా జరుగుతోంది.

మే 19న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. ఇందులో తారక్ ఊర మాస్ లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయనుంది. ఈ విజువల్ వండర్ జూన్ 25, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు చాలా కాలం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు తారక్ కాంబో సెట్ అయ్యింది. ‘అరవింద సమేత’ వంటి క్లాసిక్ హిట్ తర్వాత రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది ఒక సోషియో ఫాంటసీ, మైథలాజికల్ ఎలిమెంట్స్ కలయికతో కూడిన కథ అని తెలుస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 19నే ఇచ్చే అవకాశం ఉంది.

ఈ రెండు భారీ చిత్రాలతో పాటు, అభిమానులకు మరో స్వీట్ న్యూస్ వినిపించవచ్చు. బ్లాక్ బస్టర్ హిట్ ‘దేవర’ సీక్వెల్ (దేవర-2) కి సంబంధించిన చిన్న హింట్ లేదా అప్‌డేట్ కూడా అదే సమయంలో వచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్.మొత్తానికి, రాబోయే ఎన్టీఆర్ పుట్టినరోజు ‘యంగ్ టైగర్’ అభిమానులకు ఒక పండగలా మారబోతోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

please subscribe to Tollywoodhub YouTube channel
ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi