Sri Sri: దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తెలుగు చిత్రాలు ‘లక్కీభాస్కర్’, ‘సీతారామం’ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. మహానటిలోనూ దుల్కర్‌కు మంచి రోల్ లభించింది. దుల్కర్ చేసిన మరో సినిమా ‘కాంత’ పర్వాలేదనిపించింది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ చేస్తున్న తాజా సినిమాకు శ్రీ శ్రీ (Sri Sri) అనే టైటిల్ ఖరారైంది. “లవ్ విల్ స్పార్క్ అగైన్” అన్నది ఈ సినిమా ట్యాగ్‌లైన్. రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాకు పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుండగా, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ పీరియాడికల్ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ శ్రీనివాస్ అనే పాత్రలో నటిస్తున్నారని తెలిసింది.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో శ్రీశ్రీ సినిమా విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ సినిమా కాకుండ తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన మరో సినిమా ‘ఐయామ్ గేమ్’ ఆగస్టు 20న రిలీజ్ కానుంది. ఇలా ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే ప్రభాస్ ‘కల్కి 2’, ‘కొత్త లోక’ ఫ్రాంచైజీ చిత్రాల్లో కూడా దుల్కర్ సల్మాన్ భాగమైన సంగతి తెలిసిందే.