వారియర్‌గా మారిపోయాడు గోపీచంద్ (Gopichandh33) . ‘ఘాజీ, అంతరిక్షం’ వంటి సినిమాలను తీసిన యువ దర్శకుడు సంకల్ప్‌రెడ్డి ఓ హిస్టారికల్ డ్రామా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. జూన్ 12న గోపీచంద్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీ స్మాల్ టీజర్‌ను విడుదల చేసి, గోపీచంద్ (Hero Gopichandh) ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు మేకర్స్. విడుదలైన ఈ ప్రీ టీజర్‌లో రణధీర..వీర అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.
#MithraMandaliTeaser#mithramandalipic.twitter.com/BJtwDfeFfo
— TollywoodHub (@tollywoodhub8) June 12, 2025
గోపీచంద్ కెరీర్‌లోని ఈ సినిమా 7వ శతాబ్దం నేపథ్యంతో సాగుతుంది. ఓ హిస్టారికల్ సంఘటనను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట దర్శకుడు సంకల్ప్‌రెడ్డి (Director SankalpReddy). ఆల్రెడీ సినిమా చిత్రీకరణ మొదలైంది. శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రిలీజ్‌పై ఓ స్పష్టత రావొచ్చు.అలాగే శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై గోపీచంద్ హీరోగా కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై మరోసారి అప్‌డేట్ రావాల్సి ఉంది.