భూమిక యుఫోరియా రివ్యూ

Viswa

Web Stories

‘ఒక్కడు’ (ఇందులో మహేశ్‌బాబు హీరో) సినిమా తర్వాత దర్శకుడు గుణశేఖర్‌, భూమికా చావ్లా కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘యుఫోరియా’. ఎన్నో హిట్‌ సినిమాలు తీసిన గుణశేఖర్‌ తన రూట్‌ను కాస్త మార్చి, నేటి యువతను ద్రుష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా? రివ్యూలో చదివేద్దాం.

సినిమా యుఫోరియా (Gunasekhar Euphoria Review)
తారాగణం భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి
కథ-స్క్రీన్‌ ప్లే- దర్శకత్వం గుణశేఖర్‌
సమర్పణ: రాగిణి గుణ
నిర్మాత: నీలిమ గుణ, యుక్తా గుణ‌
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె పోతన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: నాగేంద్ర కాశి, కృష్ణ హరి
నిడివి 2 గంటల 40 నిమిషాలు
విడుదల తేదీ 06-02-2026
రేటింగ్‌:2.5/5 (Gunasekhar Euphoria Review Movie Rating Review)

Gunasekhar Euphoria Review: కథ

చైత్ర (సారా అర్జున్‌) సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతుంటుంది. తన ఫ్రెండ్‌ దిప్తి రిక్వెస్ట్‌ మేరకు ఓ పబ్‌లో జరిగే నాన్‌–ఆల్కహాల్‌ పార్టీకి వెళ్తుంది. సిటీలో బిగ్‌షాట్స్‌ (పేరు మోసిన రాజకీయ నాయకులు, బిజినెస్‌మేన్‌ కుమారులు) వారసులు అయిన వికాష్, అతని నలుగురు స్నేహి తులు చైత్రను ట్రాప్‌ చేసి, గ్యాంగ్‌ రేప్‌ చేస్తారు. దీంతో ఎంతో ధైర్యంగా చైత్ర పోలీసులకు కంప్లైట్‌ చేస్తుంది. విష్నేష్‌ , అతని ఫ్రెండ్స్‌ని జైదేవ్‌ నాయర్‌ (గౌతమ్‌వాసుదేవ్‌ మీనన్‌) అరెస్ట్‌ చేస్తాడు. రేప్‌ చేసిన వాళ్ళు మైనర్లు. పైగా పెద్ద రాజకీయ నాయకుల కొడుకులు. బాధితురాలు మైనర్‌. దీంతో రేప్‌ చేసిన విఘ్నేష్‌ గ్యాంగ్‌పై ఫోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తారు. కోర్టు వికాష్, అతని గ్యాంగ్‌ సభ్యులకు జీవితఖైదు శిక్ష విధుస్తుంది (Euphoria Movie Review).

అయితే వికాస్‌ తల్లి వింధ్య వేములపల్లి వికాస్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌. వికాస్‌ తండ్రి పెద్ద రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారి వేములపల్లి చక్రవర్తి (రోహిత్‌). కొడుకు చేసిన తప్పుడు పనికి ఈ ఇద్దరు తల్లిదండ్రుల పరువు పోతుంది. మానసికంగా కుంగిపోతారు. వైవాహిక జీవితంలో విడిపోతారు. అయితే తన వికాస్‌ను పే రోల్‌పై బయటకు తీసుకువచ్చి, అతన్ని బాగు చేయా లని వింధ్య నిర్ణయించుకుంటుంది. అనుకున్నట్లుగానే వికాస్‌ను పే రోల్‌పై బయటకు తీసుకు వచ్చి, జేఈఈ ఎగ్జామ్‌ ఎంట్రన్స్‌కు ప్రిపేర్‌ చేయాలను కుంటుంది. మరి.. జైల్లో డ్రగ్స్‌కు అలవాటు పడ్డ వికాస్‌…తన తల్లి వింధ్య ఆకాంక్షను నెరవేర్చాడా? రేప్‌కు గురైన సారా అర్జున్‌ జీవితం ఏమైంది? తన కొడుకు వికాస్‌ను సక్రమమైనదారిలో పెట్టేందుకు వింధ్య ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? అసలు..తనపై తానే కోర్టులో ఎందుకు కేసు వేసుకుంది? అన్న ఆసక్తికరమైన విషయాలను థియేటర్స్‌లోనే చూడాలి.

Euphoria Movie Analysis: విశ్లేషణ

నేటి జేన్‌ జీ తరం యువత జీవితాలను ప్రతిబింబించే చిత్రం ఇది. నేటి బిజీ లైఫ్‌లో తల్లి దండ్రులు వారి పిల్లల జీవితాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేసే సినిమా ‘యుఫోరియా’. జాగ్రత్తలు చెబుతూనే, సమాజాన్ని హెచ్చరించే సినిమా యుఫోరియా. పిల్లలు చెడిపోవడంతో వారి నిర్లక్యం ఎంత ఉందో, వారి తల్లిదండ్రులది కూడా అంతే తప్పు ఉందని ‘యుఫోరియా’ చిత్రంతో దర్శకుడు గుణశేఖర్‌ సందేశం ఇచ్చారు. లైఫ్‌లో సెకండ్‌ చాన్స్‌ ఇంపార్టెన్స్‌ను చూపించారు.

Gunasekhar's Euphoria Movie Review in telugu

యుఫోరియా మంచి సందేశాత్మక చిత్రమే. కానీ కథ, కథనాలు నడించిన తీరు, చూపించిన విధానం రోటిన్‌గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చాలా సాగదీతగా ఉంటాయి. జైల్లో బిర్యానీ ఎపిసోడ్, సైకో సాయి (అడ్డాల పృథ్వీరాజ్‌) క్యారెక్టర్‌ను ఏస్టాబ్లిష్‌ చేసేందుకు భవ్య అనే చిన్నారి యాక్సిడెంట్‌ ఎపిసోడ్‌లు కథకు అడ్డంపడ్డట్లుగానే అని పించాయి. రేప్‌ జరిగిన వీడియోను పదే పదే స్క్రీన్‌పై చూపించడం థియేటర్స్‌లో ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించ వచ్చు. కథను నిందితుడు అయిన వికాస్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోనే ఎక్కువగా ఫోకస్‌ చేశారు. అంటే నెగటివ్‌ వ్యూలో. ధైర్యంగా పోలీసుల ముందుకు వచ్చి, కంప్లైట్‌ చేసి, ఆ తర్వాత జీవి తంలో తాను అనుకున్నది సాధించిన చైత్ర పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కూడ కొంత కథనం సాగి ఉంటే బాగుండేది. సెకం డాఫ్‌లో వింధ్య–వికాస్‌ల మధ్య ఓ ఎమోషనల్‌ రైడ్‌ కంటిన్యూ అవుతు న్నప్పుడు, ‘ఆపరేషన్‌ యుఫోరియా’ అంటూ కథను పక్కకు తిప్పినట్లుగా ఉంది. కానీ క్లైమాక్స్‌ బాగుంది. ముఖ్యంగా చైత్ర పాత్రను ఎండ్‌ చేసిన తీరు బాగుంది.

దురంధర్-2 ఓటీటీ రైట్స్ కోసం జియో హాట్ స్టార్ అన్ని కోట్లు పెట్టిందా?

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

వింధ్య పాత్రలో భూమిక సూపర్భ్‌ యాక్టింగ్‌ చేశారు. కథను తన భూజాలపై వేసుకుని, ముం దుండి నడిపించారు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించారు. కానీ క్యారెక్టర్‌ దృష్ట్యా బాటిల్‌ పట్టి తప్పటగులు వేయడం మాత్రం కన్వెన్సింగ్‌గా లేదు. ఈ సీన్స్‌ను ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసు కుంటారనేది చూడాలి. వికాస్‌గా విఘ్నేష్‌ గవిరెడ్డి మంచి యాక్టింగ్‌ ప్రదర్శించాడు. పోలీస్‌ కమిషనర్‌ జై దేవ్‌ నాయర్‌గా గౌతమ్‌వాసుదేవ్‌ మీనన్‌ సినిమాలోని మంచి ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేశాడు. సైకో సాయిగా అడ్డాల పృథ్వీరాజ్, జడ్జ్‌గా నాజర్, చైత్రతల్లిగా కల్పలత, జైల్లో పోలీసుగా రాజా రవీంద్ర కనిపిస్తారు. ఆశ్రిత వేముగంటి, లిఖితయల మంచిలి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి వారి పాత్రల పరిధిమేరకు యాక్ట్‌ చేశారు.దర్శకుడు గుణశేఖర్‌ ఓ ట్రెండీ టాపిక్‌ను డీల్‌ చేసిన, ఎగ్జిక్యూషన్‌లో మాత్రం జస్ట్‌ పాస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో రిపీటెడ్‌ సీన్స్‌, ఆపరేషన్‌ యుఫోరియా వంటివి కథలోని మెయిన్‌ ఎమోషనల్‌ థీమ్‌ను పక్కదారి పట్టించాయి. మధ్యలో ఓ సాంగ్‌ ఎందుకు పెట్టారో తెలియదు. ఓ స్పీడ్‌ బ్రేకర్‌లా ఉంటుంది. కాలభైరవ మ్యూజిక్, ఆర్‌ఆర్‌ ఒకే. సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్‌ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా: నేటి టెక్నాలజీ యుగంలో తల్లితండ్రులు వారి పిల్లల పట్ల ఎంత జాగ్రత్తగా వహించాలి. ఎంత బాధ్యతతో ఉండాలి అని చాటి చెప్పే చిత్రం యుఫోరియా. అలాగే సమాజ మనుగడకు డ్రగ్స్, పబ్‌కల్చర్‌ ఎంత ప్రమాదకరమో గుర్తు చేసే సినిమా ‘యుఫో రియా’. రెగ్యులర్‌ మూవీ కాదు. లైఫ్‌లో సెకండ్‌ చాన్స్‌, పశ్చాత్తాపం…వంటి అంశాలను కూడ చర్చించారు. ఓ సారి థియేటర్స్‌లో చూడొచ్చు. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాలోకి కొన్ని విజువల్స్‌ ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ నేటి సమాజ పరిస్థితుల ద్రుష్ట్యా అవగాహన అయితే ఉండాలి (Euphoria Verdict).

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi