షాకింగ్‌..జన నాయకుడు రిలీజ్‌ వాయిదా

Viswa

Web Stories

Jananayagan Movie Postponed: ప్రముఖ తమిళ హీరో దళపతి విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ జననాయగన్‌ సినిమాను తొలుత జనవరి 9న (Jananayagan release date) రిలీజ్‌ చేయాలను కున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. మా కంట్రోల్‌లో లేని కొన్ని అనివార్యకారణాల వల్ల తమ జననాయగన్‌ సినిమా విడు దలను వాయిదా వేసినట్లుగా మేకర్స్‌ ఓ అధికారిక నోట్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌ (Jananayagan postponed)

విజయ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ‘జన నాయగన్‌’ సినిమాలో కొన్ని రాజకీయ పరమైన అంశాలు కూడా ఉన్నాయట. దీంతో ఈ సినిమాకు సెన్సార్‌ చిక్కులు వచ్చాయని, ఈ కారణాల వల్లే జన నాయగన్‌ సినిమా రిలీజ్‌ వాయిదా పడిందనే టాక్‌ తెరపైకి వచ్చింది (Jananayagan movie delay).

తెలుగు సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘భగవంత్‌ కేసరి’ సినిమా తమిళ రీమేక్‌గా ‘జన నాయగన్‌’ సినిమాను తీశారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌.కె.నారాయణ ఈ సినిమాను నిర్మించారు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా, మమితాబైజు, ప్రియమణి, ప్రకాష్‌రాజ్, బాబీ డియో ల్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇక ‘జన నాయకుడు’ సినిమా విజయ్‌ కెరీర్‌లో నటుడిగా చివరి చిత్రం. ఈ నేపథ్యంలో ఆయన చివరి చిత్రం రిలీజ్‌కు ఇలాంటి చిక్కులు రావడం, ఆయన అభిమానులను కాస్త నిరాశపరచే అంశమనే చెప్పవచ్చు. మరోవైపు రీసెంట్‌ టైమ్స్‌లో ఈ తరహా సంఘటనలను ఎక్కువగా చూస్తున్నాం. తెలుగులో బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా రిలీజ్‌కు ఒక్క రోజుముందు వాయిదా పడింది. అలాగే కార్తి ‘అన్నగారు వస్తున్నారు’ కూడా ఒక్కరోజు రిలీజ్‌కు ముందు వాయిదా పడింది. ఇప్పుడు ‘జన నాయగన్‌’ రిలీజ్‌కు ఒక్క రోజు ముందుగా వాయిదా పడింది. ఇక ‘జన నాయగన్‌’ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ టైటిల్‌తో రిలీజ్‌ అవుతుంది (ananayagan latest news)

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos