జైల్లో ఖల్‌నాయక్‌ సినిమా ఐడియా వచ్చింది – సంజయ్‌దత్‌

Viswa
1 Min Read

Web Stories

Khalnayak Returns: బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ సినిమా ‘ఖల్‌నాయక్‌’ సీక్వెల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ‘ఖల్‌ నాయక్‌’ సినిమా సీక్వెల్‌ను ‘ఖల్‌ నాయక్‌ రిటర్న్స్‌’ (Khalnayak Returns)పేరుతో ఏప్రిల్‌ 24న అధికారికంగా ప్రకటించారు సంజయ్‌దత్‌. ముంబైలో జరిగిన ఓ వేడుకలో ఈ సినిమాను ప్రకటించి, మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో సంజయ్‌దత్‌ ఈ ‘ఖల్‌నాయక్‌ 2’ సినిమా ఐడియా ఎలా వచ్చిందో అని చెప్పిన విషయాలు ఆసక్తికరంగా అనిపించాయి.

ఈ విషయంపై సంజయ్‌దత్‌ (Sanjay Dutt About Khalnayak Sequel)మాట్లాడుతూ–‘‘ముంబై బ్లాస్ట్‌ కేసులకు సంబంధించి జైల్లో ఉన్నప్పుడు, దాదాపు 4వేలమంది ఖైదీలను నా ‘ఖల్‌ నాయక్‌’ సినిమా చూశారా? అని అడగ్గా, వారు చూశామని చెప్పారు. ‘ఖల్‌ నాయక్‌’ సీక్వెల్‌ వచ్చినా చూస్తామని చెప్పారు. ఆ సమయంలోనే ‘ఖల్‌ నాయక్‌’ సినిమా సీక్వెల్‌ తీయాలనే ఆలోచన నాలో కలిగింది. జైలు నుంచి పే రోల్‌పై వచ్చిన తర్వాత, ఈ సినిమాను గురించి దర్శకుడు సుభాష్‌ఘాయ్‌తో చర్చించాను. ఆయన సీక్వెల్‌ చేయవచ్చు అన్నారు’’ అని చెప్పుకొచ్చారు.

khalnayak2 cinema first look poster

‘ఖల్‌ నాయక్‌ రిటర్న్స్‌’ సినిమాను సంజయ్‌దత్‌ ‘త్రీ డైమెన్షన్‌ మోషన్‌ పిక్చర్‌’, అక్ష కాంబోజ్‌ ‘ఆస్పెక్ట్‌ ఎంటర్‌టైన్మెంట్‌’, జియో స్టూడియోస్‌ జ్యోతి దేశ్‌ పాండే నిర్మిస్తున్నారు. ‘ఖల్‌నాయక్‌ రిటర్న్స్‌’ (Khalnayak 2) చిత్రానికి సుభాష్‌ ఘాయ్‌ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారట. ఓ యువ దర్శకుడు, ఈ సినిమాను తెరకెక్కించ నున్నారని, అతని పేరును త్వరలోనే మేకర్స్‌ ప్రకటిస్తారని బాలీవుడ్‌ సమాచారం.

అలాగే ‘ఖల్‌ నాయక్‌’ సినిమా తొలిభాగంలో భాగమైన, జాకీష్రాఫ్, మాధురీ దీక్షిత్‌లు కూడా ‘ఖల్‌నాయక్‌ రిటర్న్స్‌’ సినిమాలో భాగమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

Please Share
Share This Article
13 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu