అందుకే రజనీకాంత్‌ సినిమా నుంచి తప్పుకున్నాను: లోకేష్‌ కనగరాజ్‌

Viswa

Web Stories

Lokesh Kanagaraj‘కూలీ’ సినిమా తర్వాత రజనీకాంత్‌తో తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఓ సినిమా చేయాల్సింది. రజనీకాంత్‌ కెరీర్‌లోని ఈ 173వ సినిమాకు : కమల్‌హాసన్‌ నిర్మాత. అయితే ఈ సినిమాకు లోకేష్‌ కనగరాజ్‌ ప్లేస్‌లో సుందర్‌.సి వచ్చారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ నుంచి సుందర్‌.సి కూడా తప్పుకోవడంతో, ఫైనల్‌గా సిబిచక్రవర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. వచ్చే పొంగల్‌కి రిలీజ్‌ చేస్తున్నారు (Lokesh Kanagaraj latest news).

అయితే రజనీకాంత్‌ సినిమా నుంచి తప్పుకోవడం గురించి, లోకేష్‌కనగరాజ్‌ (Director Lokesh Kanagaraj)  స్పందించారు. ‘‘కూలీ’ రిలీజ్‌ తర్వాత రజనీకాంత్‌–కమల్‌హాసన్‌గార్లు తమ కొత్త సినిమా కోసం కథ రెడీ చేయమన్నారు. నెలన్నర స్క్రిప్ట్‌ వర్క్‌ చేసి, ఈ కథను వారికి వినిపించాను. కానీ యాక్షన్‌ సినిమా కాకుండ, వారు ఓ లైట్‌హార్టెడ్‌ సాఫ్ట్‌ మూ వీ చేయాలను కుంటున్నట్లుగా చెప్పారు (Lokesh Kanagaraj reaction). దీంతో నాకు ఈ జానర్‌లో సినిమా చేయడం రాదు. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాను’’ అని లోకేష్‌కనగరాజ్‌ తెలిపారు (Lokesh Kanagaraj Rajinikanth movie).

అలాగే కార్తీతో తాను చేయాల్సిన ‘ఖైదీ 2’ సినిమాను గురించి కూడా లోకేష్‌ మాట్లాడారు. ‘కూలీ’ తర్వాత ‘ఖైదీ 2’ సినిమానే చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. అల్లు అర్జున్‌గారితో ఎప్పట్నుంచో ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. దీంతో మైత్రీమూవీస్‌తో ప్రియర్‌ కమిట్‌మెంట్‌గా ఈ మూవీ చేస్తున్నాను. ఈ చిత్రం తర్వాత నా తర్వాతి చిత్రం ‘ఖైదీ 2’నే. విక్రమ్‌ 2, రోలెక్స్‌ చిత్రాలు కూడా చేస్తాను. అలాగే లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో కూడా సినిమా వస్తాయి’’ అని చెప్పుకొచ్చారు లోకేష్‌ కనగరాజ్‌.

ఇక లోకేష్‌కనగరాజ్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ చేయనున్న సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది. ఈ సినిమా 2027లో రిలీజ్‌ కావొచ్చు.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos