మహేశ్‌బాబు, రాజమౌళిల సినిమాకు రూ. 40 కోట్లతో స్పెషల్‌ సెట్‌?

Viswa
Maheshbabu Holiday: మహేశ్‌బాబుకు లాంగ్‌ బ్రేక్‌

Web Stories

హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి (Rajamouli new movie )కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్‌ మూవీ సెట్స్‌పై ఉంది. అంత ర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. సో…అంతర్జాతీస్థాయి ప్రమాణాలు ఉండేలా మేకర్స్‌ ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒడిస్సాలో
కీలక షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో ఓ భారీ చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీశారు. ఆపై..అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ఓ సెట్‌లో కొంత టాకీ పార్టు చిత్రీకరణ
జరిగింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో భారీ సెట్‌ను సెటప్‌ను రెడీ చేస్తున్నారట మేకర్స్‌. హైదరాబాద్‌ శివార్లలో వారణాసి నగరం ప్రతిబింబించేలా ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేశారట మేకర్స్‌. ఈ సెట్‌ వర్క్‌ ఎప్పట్నుంచో జరుగుతుంది. తాజాగా ప్రచారంలోకి వచ్చిన విషయం ఏంటంటే..ఈ సెట్‌ కాస్ట్‌ రూ. 40 కోట్ల రూపాయలకుపైనే ఉంటుందట (Rajamouli and Maheshbabu new movie Set cost). ఇండియాలోనే కాస్ట్‌లీయస్ట్‌ సెట్‌గా, ఈ సెట్‌ను తీర్చిదిద్దుతున్నారట మేకర్స్‌. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…ఈ మూవీ మేజర్‌ కథ కాశీలో జరుగుతుందని, అందుకే ఇంత పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టి, వారణాసి సెట్‌ను మేకర్స్‌ రెడీ చేయిస్తున్నారని టాలీవుడ్‌ టాక్‌. సెట్స్‌లో వర్క్‌ చేయడం రాజమౌళికి కొత్త ఏం కాదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా లోని మేజర్‌ సన్నివేశాలను సెట్స్‌లోనే తీశారు.

ఇక మహేశ్‌బాబు కెరీర్‌లోని ఈ 29వ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, కేఎల్‌ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. మహేశ్‌బాబుతో పాటుగా, ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీ రాజ్‌ సుకుమారన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. 2027 ప్రారంభంలో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi