please subscribe to Tollywoodhub YouTube channel

రాజాడీలక్స్‌లో రాజాసాబ్‌….స్టోరీ ఏంటంటే…!

Viswa

Web Stories

ప్రభాస్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ హారర్‌ మూవీ ‘ది రాజాసాబ్‌ (TheRajasaabStory)’ మూవీ డిసెంబరు 5న విడుదల కానుంది. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ప్రభాస్‌ తొలిసారిగా హారర్‌ కామెడీ జానర్‌లో చేస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్‌లు హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ 70 శాతానికి పైగా పూర్తయింది. కాగా ఇటీవలే ఈ సినిమా కథను గురించి, ఈ చిత్రం దర్శకుడు మారుతి చెబు తున్న విషయాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

‘‘ది రాజాసాబ్‌’ సినిమా తాత–మనవడి నేపథ్యంతో ఉంటుందని, అమ్మమ్మ పాత్ర కూడా ఎంతోకీలకంగా ఉంటుంది. ఈ సినిమా నిడివి మూడు గంటలకు పైగా ఉంటుంది. హారర్‌ ఎలిమెంట్స్‌ సూపర్భ్‌గా ఉంటా యి. ఒకప్పుడు నేను యానిమేటర్‌గా వర్క్‌ చేశాను. కాబట్టి…నాకు వీఎఫ్‌ఎక్స్‌ పై మంచి పట్టు ఉంది. ఈ సినిమాలో చూస్తారు. హారర్‌ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లోని ‘ది రాజాసాబ్‌’ (TheRajasaab) సినిమా ఆడియన్స్‌ను సరికొత్త అనుభూతికి లోనైయ్యేలా చేస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

ఇక మారుతి (TheRajasaab movie director) మాటలను బట్టి…ఈ ‘ది రాజాసాబ్‌ (TheRajasaab Movie)’ సినిమాలో తాత–మనమడి కథ అని కన్ఫార్మ్‌ అయిపో యింది. ఆసక్తి కరమైన అంశం ఏంటంటే… మారుతి గత రెండు చిత్రాలు కూడా ఈ తరహా కథలే. మారుతి గత చిత్రం ‘పక్కా కమర్షియల్‌’ మూవీ, తండ్రీకొడుకుల ఎమోషన్‌ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు ముందు సాయిధరమ్‌తేజ్‌తో మారుతి తీసిన ‘ప్రతిరోజూపండగే’ చిత్రం ప్రధానంగా తాత –మనమడి నేపథ్యంలో ఉంటుంది. ఇప్పుడు…‘ది రాజాసాబ్‌’ మెయిన్‌ స్టోరీ ప్లాట్‌ కూడ ఇదే కావడం విశేషం (TheRajasaab Movie Story).

అయితే ‘ది రాజాసాబ్‌’ సినిమాలో ప్రభాస్‌ తాతయ్యగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ‘ది రాజాసాబ్‌’ సినిమా టీజర్‌తో ఈ విషయం స్పష్టమైపోయింది. అయితే ‘ది రాజాసాబ్‌’ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు డిఫరెంట్‌ లుక్స్‌ కనిపించాయి. దీంతో…‘ది రాజాసాబ్‌’ సినిమాలో ప్రభాస్‌ ఏమైనా ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? అనే డౌట్‌ వినిపించింది. కానీ ‘ది రాజాసాబ్‌’మూవీలో ప్రభాస్‌ది సింగిల్‌ క్యారెక్టర్‌నే అని, ఇటీవల మారుతి తన ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో ‘ది రాజాసాబ్‌’ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉండ బోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ‘ది రాజాసాబ్‌’ సినిమా టీజర్‌లో

అంశాలను గురించి కచ్చితంగా తెలుసుకోవాలంటే…డిసెంబరు 5న ‘ది రాజాసాబ్‌’ సినిమాను థియే టర్స్‌లో చూడాల్సిందే. అలాగే ‘ది రాజాసాబ్‌’ సినిమా టీజర్‌లో పెద్ద భవంతి కనిపించింది కదా. అది ఈ సినిమాలో సెకండాఫ్‌లో కనిపిస్తుంది. ఈ భవంతి పేరు రాజాడీలక్స్‌ అని తెలిసింది. ఒక దశలో ఈ సిని మాకు రాజాడీలక్స్‌ అనే టైటిల్‌ను అనుకున్నారట. కాకపోతే…ప్రభాస్‌ వంటి పెద్ద హీరో సినిమాకు, ఓ భవంతి పేరు టైటిల్‌గా ఉండే బాగోందని, క్యారెక్టర్‌ పేరును సినిమా టైటిల్‌గా పెట్టారట. ఇక ‘ది రాజాసాబ్‌’ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi