కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ మధ్య ఏదో నడుస్తోందంటూ తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ గాసిప్స్‌కు తోడు, వీరిద్దరూ త్వరలోనే ఒక పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, ధనుష్ మరియు మృణాల్ ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) వివాహం చేసుకోబోతున్నారట.
గతంలో కూడా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందనే చర్చ జరిగింది. అప్పట్లో మృణాల్ ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ అదే తరహా కథనాలు వెలువడుతున్నాయి. మృణాల్ పాల్గొనే సినిమా వేడుకలకు ధనుష్ హాజరవ్వడం, ధనుష్ కుటుంబ సభ్యులతో మృణాల్‌కు ఉన్న సోషల్ మీడియా సంబంధాలు ఈ పుకార్లకు ప్రధాన కారణంగా మారాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను 2004లో వివాహం చేసుకున్న ధనుష్, దాదాపు 18 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2024లో ఈ జంటకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. వీరికి ఇద్దరు కుమారులు (యాత్ర, లింగ) ఉన్నారు.
విడాకుల అనంతరం ధనుష్ తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తున్నాడు. ఇటీవల ‘కుబేర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ధనుష్, మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘సీతారామం’తో నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన ఈ భామ, ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ పెళ్లి వార్తలపై అటు ధనుష్ కానీ, ఇటు మృణాల్ కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి రూమర్లు రావడం సర్వసాధారణం. అయితే పెళ్లి డేట్‌తో సహా వార్తలు రావడంతో ఇది కేవలం గాసిప్పేనా లేక నిజంగానే ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.