ఎప్పుడూ లేనంతగా పవన్‌కల్యాణ్ (Pawankalyan) వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. పవన్ చేసిన హిస్టారికల్ మూవీ ‘హరిహరవీరమల్లు’ జూలైలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఓజీ సినిమా రిలీజ్ సెప్టెంబరు 25న ఉంది. ఈ రెండు సినిమాలను రిలీజ్‌లకు రెడీ చేసిన పవన్‌కల్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్‌కల్యాణ్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లోని మూవీ ఇది. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటిస్తారు పవన్ కల్యాణ్. మైత్రీమూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వరితగతిన ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలని పవన్‌కల్యాణ్ భావిస్తున్నాడు. ఈ పెండింగ్ ప్రాజెక్ట్ షూటింగ్‌ని ఎలాగైనా పూర్తి చేసి, 2026లోనే రిలీజ్ చేయాలన్నది పవన్‌కల్యాణ్ ప్లాన్ అని టాక్.
మరోవైపు ఉస్తాద్‌భగత్ సింగ్ సినిమాను పూర్తి చేసిన తర్వాత కూడా మరో సినిమా (Pawankalyan Samuthirakani) చేయాలని పవన్‌కల్యాణ్ భావిస్తున్నాడు. త్రివిక్రమ్ ఓ కథ చెప్పారు. కానీ పవన్‌కు నచ్చలేదట. పైగా త్రి విక్రమ్ (Director Trivikram) ఇప్పటికే వెంకటేష్, ఎన్టీఆర్‌లతో సినిమాలు కమిటైయ్యాడు. దీంతో త్రివిక్రమ్‌తో పవన్ సినిమా ఇప్పట్లో అయితే ఉండదు. అదే ఇదే సమ యంలో తమిళ దర్శకుడు సముద్రఖని (Director Samuthirakani) పవన్‌కల్యాణ్‌కు ఓ కథ చెప్పారట. ఈ స్టోరీ లైన్ పవన్‌కు నచ్చిందట. పూర్తి స్క్రిప్ట్‌ని పూర్తి చేసుకుని, మరోసారి ఫైనల్ నరేషన్ ఇవ్వమన్నారట. పవన్‌ను ఇంప్రెస్ చేస్తే సముద్రఖనికి మరో సినిమా చాన్స్ దక్కినట్లే. ఇక పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌లు హీరోలుగా నటించిన ‘బ్రో’ సినిమాకు సముద్రఖని ఓ దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ‘బ్రో’ సినిమా ఓ తమిళ సినిమాకు తెలుగు రీమేక్. ఆ తమిళ సినిమాలో సముద్రఖని మెయిన్ లీడ్ రోల్ చేశారు.