ప్రభాస్‌కు పెద్ద సవాలే!

Viswa
Prabhas movie Latest photos

Web Stories

ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా ఫిల్మ్‌ ‘స్పిరిట్‌’ (Prabhas Spirit) షూటింగ్‌ ఇంకా స్టార్ట్‌ కాలేదు. ఈ ఏడాది చివర్లో స్టార్ట్‌ కావొచ్చు. ఇది ప్రభాస్‌ ప్రస్తుత సినిమాలు ‘ది రాజాసాబ్, ఫౌజి’ చిత్రీకరణ షూటింగ్‌ షెడ్యూల్స్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ‘స్పిరిట్‌’ (Spirit Story)  సినిమా గురించి, ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వచ్చాయి.

‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ది పోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌ అనగానే….ఇక ఈ మూవీలో ప్రభాస్‌కు భారీ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, స్టైలిష్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌లను ఈ చిత్రం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Spirit Movie Director SandeepReddy Vanga)  ప్లాన్‌ చేశాడని, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఊహించేసుకుంటున్నారు. కానీ…సందీప్‌ రైటింగ్‌ స్టైల్‌ వేరు కదా. యాక్షన్‌ సీక్వెన్స్‌లతో పాటుగా, రొమాన్స్‌ పరిధిని కూడా బాగానే కథలో ఉంచారట సందీప్‌రెడ్డి వంగా. ‘స్పిరిట్‌’ (Spirit Movie News)  సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్‌లో భాగంగా, హీరోయిన్‌ త్రిప్తి దిమ్రీతో కలిసి ఎక్స్‌ట్రీమ్‌ అండ్‌ బోల్డ్‌ రొమాంటిక్‌ సీన్స్‌లో యాక్ట్‌ చేయనున్నారట ప్రభాస్‌.

prabhas Latest25
యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ..ఇలా డిఫరెంట్‌ జానర్స్‌లో ప్రభాస్‌కు మంచి పట్టుంది. ‘ది రాజా సాబ్‌’ సినిమాతో హారర్‌ జానర్‌లోకి కూడా వస్తున్నాడు ప్రభాస్‌. కానీ ఎక్స్‌ట్రీమ్‌ రొమాన్స్‌ అండ్‌ బోల్డ్‌ సీన్స్‌లో ప్రభాస్‌ యాక్టింగ్‌ చేసింది తక్కువ. మరోవైపు సందీప్‌రెడ్డి వంగా డైరె క్షన్‌లోని ‘యానిమల్‌’ సినిమాలో త్రిప్తి దిమ్రీ, ఈ చిత్రం హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి మంచి ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ కెమిస్ట్రీని పండించింది. ఇప్పుడు మళ్లీ ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమా కోసం ఆ తరహా రోల్‌ చేసేందుకు సిద్ధమైంది. అయితే త్రిప్తితో కలిసి ప్రభాస్‌ ఈ రొమాంటిక్‌ అండ్‌ బోల్డ్‌ సీక్వెన్స్‌ సీన్స్‌లో ఎలా చేస్తారనే విషయం చూడాలి. పైగా ప్రభాస్‌ చాలా సిగ్గు పడే వ్యక్తి. మరి.. ఇలాంటి వ్యక్తితో సందీప్‌రెడ్డి ఎలాంటి రొమాంటిక్‌ సీన్స్‌ను రాబట్టుకుంటాడో చూడాలి.

టీసీరిస్‌–భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై భూషణ్‌కుమార్, గుల్షన్‌కుమార్, క్రషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగాలు కలిసి నిర్మిస్తున్న ‘స్పిరిట్‌’ సినిమా 2027లో విడుదల కావొచ్చు. ఈ ఏడాది సెప్టెంబరులో ‘ది రాజాసాబ్‌’, 2026లో ‘ఫౌజి’ సినిమాలు రిలీజ్‌ కానున్నాయి.

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi