రామ్‌చరణ్‌ పెద్ది..మళ్ళీ పుడతామా ఏంటీ?

Ramcharan peddi movie Release : రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లోని పెద్ది సినిమా విడుదల తేదీ ఖరారైంది. రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

Viswa
2 Min Read
Peddi Release Date

రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘పెద్ది’ (Peddi First shot) సినిమా గ్లింప్స్‌ శ్రీరామనవమి సందర్భంగా 6 ఏప్రిల్‌ 2025న విడుదల చేశారు.

‘‘పెద్ది పెద్ది పెద్ది అని..బ్యాగ్రౌండ్‌లో ఆడియన్స్‌ అరుపులు వినిపిస్తుంటే…..
ఒకటే పనిచేసేదానికి ఒకేలా బతికేదానికి….ఇంతపెద్ద బతుకెందుకు….ఏదైనా ఈ నెల మీద ఉన్నప్పుడే సేసేయ్యాలా…పుడతామా ఏంటీ మళ్లీ… చెప్‌మే..’ అని ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో రామ్‌ చరణ్‌ చెప్పిన డైలాగ్స్‌ ఆడియన్స్‌ అలరించేలా, ఫ్యాన్స్‌ను హుషారెత్తించేలా చేస్తున్నాయి. ఇక పెద్ది ఫస్ట్‌షాట్‌ రిలీజ్‌డేట్‌ గ్లింప్స్‌ వీడియోలోని లాస్ట్‌ షాట్‌ , ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటుంది.

ఈ మూవీ ఏఆర్‌ రెహహాన్‌ సంగీతం అందిస్తున్నారు.

రామ్‌చరణ్‌ (Ramcharan) ‘పెద్ది (Peddi movie)’ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉప్పెన’ మూవీ తర్వాత బుచ్చిబాబు సాన డైరెక్ట్‌ చేస్తున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇంకా ఈ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బాలీవుడ్‌ నటుడు దివ్వేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా కనిపిస్తారు.

పెద్ది సినిమా గ్లింప్స్‌లో రామ్‌చరణ్‌ క్రికెట్‌ ఆడుతూ కనిపించారు…కానీ ఈ సినిమాలో క్రికెట్‌తో పాటుగా, కబడ్డీ, ఖోఖో, కుస్తీ…ఆటలా ప్రస్తావన కూడా ఉంటుంది. ఈ పీరియాడికల్‌ మల్టీస్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ లో కుస్తీదే మెయిన్‌ స్పోర్ట్స్‌.

ఈ పెద్ది మూవీలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అదీ తండ్రీకొడుకులుగానా, లేక అన్న దమ్ములుగానా అనేది తెలియాల్సి ఉంది. అలాగే రామ్‌చరణ్‌ పెద్ది సినిమాను వచ్చే ఏడాది మార్చి 27 (Peddi movie Release date).. అంటే రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

మార్చి నెల అంటే రామ్‌చరణ్‌కు కలిసొచ్చే విషయమే..రామ్‌చరణ్‌ కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెర్స్‌ మూవీ ‘రంగస్థలం’, రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌తో కలిసి రామ్‌చరణ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌… చిత్రాలు మార్చి నెలాఖర్లోనే విడుదల అయ్యాయి.. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌. సో… ఈ సెంటిమెంట్‌ ప్రకారం పెద్ది సినిమా కూడా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని చరణ్‌ ఫ్యాన్స్‌ హోప్స్‌ పెట్టుకున్నారు. ఏం జరుగు తుందో చూడాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *