గుస్సాడీ దీక్ష నేపథ్యంతో మైసా

Viswa
2 Min Read

Web Stories

Rashmika Mandanna Mysaa Teaser: హీరోయిన్‌ రష్మికా మందన్నా (Rashmika Mandanna ) టైటిల్‌ రోల్‌లో నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ యాక్షన్‌ డ్రామా ‘మైసా’ ( Mysaa Movie). ఈ చిత్రంలో ఈశ్వరీరావు, గురు సోమసుందరం, రావు రమేష్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రవీంద్ర పుల్లె (Mysaa movie director Rawindra Pulle) దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ పతాకంపై అనిల్, అజయ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబరు 27న (Mysaa Movie Release date) విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. 12 రోజులు పాటు చిత్రీకరణ జరిపితే, షూటింగ్‌ పూర్త వుతుంది. ఈ సందర్భంగా ‘మైసా’ సినిమా టీజర్‌ (Mysaa Teaser) లాంచ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ హైదరా బాద్‌లో నిర్వహించారు. మైసా మెశ్రా అనే పాత్రలో రష్మికా మందన్నా నటించారు.

గుస్సాడీ దీక్ష నేపథ్యంతో మైసా
గుస్సాడీ దీక్ష నేపథ్యంతో మైసా

‘‘అలసిపోయాను..ఆగిపోయాను…ఓడిపోయాను..’

‘‘బుర్ర దొబ్బిందా…బయట అంతమంది జనం..ఒక్క అమ్మాయి’

‘నీకింకా అర్థం కావడం లేదు..యుద్ధానికి ఆయుధం అంటే భయం కానీ…
ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు’,

‘షీ ఈజ్‌ ది బ్లడీ వెపన్‌…హూ డిసైడ్‌ ది వార్‌’

‘‘సావు నుండైనా నీ కోసం వస్తాను..నాన్న’ అనే డైలాగ్స్‌ ఈ సినిమా టీజర్‌లో ఉన్నాయి.

ఇక హైదరాబాద్‌లో జరిగిన ‘మైసా’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రష్మికమందన్నా మాట్లాడారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా కోసం తాను పూర్తిస్థాయిలో ఎమోషనల్‌ యాక్టింగ్‌ చేశానని, ఇప్పుడు ‘మైసా’ కోసం తన పూర్తిశక్తిమేర యాక్షన్‌ చేశానని రష్మికమందన్నా చెప్పారు. ఈ చిత్రం కోసం దర్శకుడు రవీంద్ర తనను చాలా కష్టపెట్టారని ఆమె తెలిపారు. కేరళలో అండర్‌వాటర్‌ సీక్వెన్స్, బురదలోఫైట్, జలపాతం నుంచి జంప్‌ చేయడం, ఫారెస్ట్‌లో భారీ యాక్షన్‌…ఇలా మైసా సినిమాలోని అన్నీ యాక్షన్‌ సన్నివేశాలను డూప్‌ లేకుండా తానే చేశానని రష్మికా తెలిపారు. ప్రేక్షకులకు ‘మైసా’ సినిమా టీజర్‌ నచ్చినట్లే, ఈ సినిమా కూడా నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మైసా చిత్రీకరణ సమయంలో తాను గాయపడ్డ విషయం గురించి రష్మికమందన్నా స్పందించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ డ్యాన్స్‌ సీక్వెన్స్‌లో భాగంగా, తన హిప్‌ టెండెన్‌ బ్రేక్‌ అయ్యిందని, ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో మూడు వారాలు పట్టొచ్చని రష్మికా మందన్నా అన్నారు.

ఇక గోండ్‌ తెగకు సంబంధించిన గుస్సాడీ అనే దీక్ష నేపథ్యం ప్రధానంగా ‘మైసా’ సినిమా సాగుతుందని తెలిపారు దర్శకుడు రవీంద్ర పుల్లె.    ‘మైసా’ సినిమాను ఈ దీపావళికే రిలీజ్‌ చేద్దామని అనుకున్నామని, కాకపోతే రష్మికగారికి గాయం కావడం వల్ల నవంబరు 27న రిలీజ్‌ చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరై అజయ్‌ అన్నారు.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu