Rashmika Mandanna Thama: ప్రేతాత్మగా రష్మికా మందన్నా…దీపావళికి థియేటర్స్‌లోకి…!

Viswa
1 Min Read

Web Stories

Rashmika Mandanna Thama: మునుపెన్నడూ చూడని పాత్రలో నటించేందుకు హీరోయిన్‌ రష్మికా మందన్నా (Rashmika Mandanna) రెడీ అవుతున్నారని తెలిసింది. ప్రస్తుతం హిందీలో ‘థామా’ (Thama) అనే ఓ హారర్‌ మూవీ చేస్తున్నారు రష్మికా మందన్నా. ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటిస్తుండగా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ హారర్‌ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఢిల్లీలో కొంత చిత్రీకరణ జరిపారు. ఈ నెలాఖర్లో లేదా ఫిబ్రవరి రెండో వారంలో ‘థామా’ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఊటీలోని ప్లాన్‌ చేశారు. హిందీలో ముంజ్య వంటి సూపర్‌హిట్‌ హారర్‌ ఫిల్మ్‌ను తీసిన ఆదిత్యా సర్పోత్దార్‌ ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఈ మూవీలో రష్మికా మందన్నా ద్విపా త్రాభినయం చేస్తున్నారని తెలిపింది. ఇందులో ఓ పాత్రలో రష్మికా మందన్నా ప్రేతాత్మగా కనిపిస్తారని బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఇక ‘థామా’ సినిమా వచ్చే దీపావళి (Thama Release) సందర్భంగా రిలీజ్‌ కానుంది. దినేష్‌ విజన్‌ ఈ సినిమాకు నిర్మాత. హిందీలో ‘బేడియా, స్త్రీ, స్త్రీ 2, ముంజ్య’ వంటి సినిమాలను నిర్మించింది దినేష్‌ విజన్‌ అన్నది తెలిసిన సంగతి తెలిసిందే.

Ramcharan Peddi: దీపావళికి రామ్‌చరణ్‌ పెద్ది?

హిందీలో విక్కీకౌశల్‌తో రష్మికా మందన్నా చేసిన హిందీ చిత్రం ‘ఛావా’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సల్మాన్‌తో రష్మికా చేసిన ‘సికందర్‌’, ధనుష్‌–నాగార్జునలు చేసిన ‘కుబేర’, సోలోగా చేస్తున్న ‘ది గాళ్‌ఫ్రెండ్‌’ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇలా రష్మికా మందన్నా కెరీర్‌లో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు.

Rashmika Mandanna: ది గార్ల్‌ఫ్రెండ్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విజయ్‌ దేవకరొండ

Gamechanger Story:గేమ్‌చేంజర్‌ ట్రైలర్‌ రిలీజ్‌…స్టోరీ ఇదేనా?

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi