‘భీష్మ’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత హీరో నితిన్ (nithin), దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ‘రాబిన్‌హుడ్’(Robinhood Release) సినిమా రాబోతోంది. ఈ సినిమాను తొలుత 2024 డిసెంబరు 25న రిలీజ్ చేయాలనుకున్నారు. మైత్రీమూవీమేకర్స్ నిర్మాతలు. ఈ సారి క్రిస్మస్‌కు పెద్దగా సినిమాలేవీ లేవు. కాబట్టి నితిన్‌కు క్రిస్మస్ రిలీజ్ అనేది కచ్చితంగా ఫ్లస్ పాయింట్. కానీ మైత్రీమూవీమేకర్స్ నిర్మించిన ‘పుష్ప 2’కుఓ మోస్తారు రెస్పాన్స్ ఇంకా లభిస్తూనే ఉంది. దీంతో ‘రాబిన్‌హుడ్’ రిలీజ్‌ను వాయిదా వేస్తే, ‘పుష్ప2’ సినిమాకు కొంతమేరకు లాభిస్తుందని మైత్రీమూవీ మేకర్స్ ప్లాన్ చేశారు.
pushpa2 Collections: హిందీలో టాప్ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?
రాబిన్‌హుడ్ వాయిదాకు మాత్రం నితిన్ ఒప్పుకోలేదట. ఇలా మైత్రీమూవీమేకర్స్, నితిన్‌ల మధ్య ఈ సినిమా రిలీజ్ విషయంలో బేధాభిప్రాయాలు వచ్చాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపించింది. ఫైనల్‌గా రాబిన్‌హుడ్ సినిమాను అయితే వాయిదా వేశారు. కానీ ‘రాబిన్‌హుడ్’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మైత్రీమూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఆల్రెడీ రామ్‌చరణ్ గేమ్‌చేంజర్ జనవరి 10న, బాలకృష్ణ డాకుమహారాజ్ ‘జనవరి 12న, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న రిలీజ్ కాను న్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 13న ‘రాబిన్‌హుడ్’ను రిలీజ్ చేయాలని మైత్రీమూవీమేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
Ramcharan Peddhi: సైలెంట్‌గా కథను మార్చేశారా?
Pushpa2 Collections: పుష్ప 2 సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి?
కరోనా సమయంలో ‘భీష్మ’ సినిమా విడుదలైంది. మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రాంగ్ రిలీజ్ వల్ల పెద్ద స్థాయి హిట్ కాలేకపోయింది. మరి..సంక్రాంతి సమయంలో విడుదలై, రాబిన్‌హుడ్ సినిమాకుపాజిటివ్ టాక్ వస్తే నితిన్‌కు మంచి చాన్స్ దొరికినట్లే కదా. కంటెంట్ ఏమాత్రం ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసినా ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళ్తారు