please subscribe to Tollywoodhub YouTube channel

ఓటీటీ సొమ్ము నాకొద్దు..ఆమిర్‌ఖాన్‌ కొత్త ప్రయోగం సక్సెస్‌ అయ్యేనా?

Viswa
Sitaarezameen Par OTT

Web Stories

కరోనా తర్వాత సినిమాల బిజినెస్‌ పూర్తిగా మారిపోయింది. ఓటీటీ సంస్థల అప్రూవల్‌ రానిదే సినిమాల విడుదల తేదీలు ఖరారు కానీ పరిస్థితి. కానీ బాలీవుడ్‌ టాప్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (AamirkhanMovies) మాత్రం ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. తన లెటెస్ట్‌ మూవీ ‘సితారే జమీన్‌ పర్‌’ (SitaareZameenPar OTT) సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్‌ వద్దని, ఆ ఓటీటీ సంస్థల ఆఫర్‌ను వద్దనుకుని, ఎనిమిది వారాల తర్వాత యూ ట్యూబ్‌లో పే పర్‌ వ్యూ సిస్టమ్‌లో స్ట్రీమింగ్‌ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇది కచ్చితంగా ఆమిర్‌ఖాన్‌ చేస్తున్న కొత్త ప్రయోగమనే చెప్పాలి. అలాగే ఓటీటీ సంస్థల ఎత్తుగడలకు మరో కొత్త పరిష్కార మార్గం కూడా కావొచ్చు.

అయినా..ఓటీటీ సంస్థల ఆఫర్‌ను వద్దనుకుని, ఆమిర్‌ఖాన్‌ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణ యం తీసుకోవడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ ఆమిర్‌ఖాన్‌ అన్నంత పని చేస్తే.. ఆ తర్వాతి పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలని, చాలా మంది సినీ లవర్స్, దర్శక–నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక స్పానిష్‌ మూవీ ‘ఛాంపియన్‌’ సినిమాకు హిందీ రీమేక్‌గా రానున్న ‘సితార జమీన్‌ పర్‌’ (SitaareZameenPar Release) సినిమా జూన్‌ 20న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఆర్‌ఎస్‌ ప్రసన్న డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్‌గా చేశారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆమిర్‌ఖాన్‌ నుంచి మరో మూవీ రానుంది. ఈ తరుణంలో ఈ చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi