10 సంవత్సరాలు..55 ట్రాన్స్‌ఫర్స్‌

Viswa
1 Min Read

Web Stories

Transfer Trimurthulu: ‘మనసిచ్చి చూడు’, ‘పెళ్లి’, ‘మా బాలాజీ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో వడ్డే నవీన్‌ కొంత గ్యాప్‌ తీసుకుని, ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’  (Transfer Trimurthulu Cinema) అనే సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా కోసం తొలిసారి వడ్డే నవీన్‌ నిర్మాతగా కూడా మారారు. ఇలా వడ్డే నవీన్‌ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా జూన్‌ 19న (Transfer Trimurthulu Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటించగా, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో, ”ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ సినిమా ట్రైలర్‌ను (Transfer Trimurthulu Trailer)  రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ఇరవై సంవత్సరాల క్రితం నాటి ఓ కేసును ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎలా సాల్వ్‌ చేశారు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన రాజకీయ సవాళ్లు ఏమిటి? అన్న పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ సినిమా కథనం సాగుతుంది.

ఈ కింది డైలాగ్స్‌ ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి

స్టేట్‌ని షేక్‌ చేసిన కేసు..వారంలో రోజుల్లో ఎలక్షన్స్‌

10 సంవత్సరాలు..55 ట్రాన్స్‌ఫర్స్‌

నన్ను ట్రాన్స్‌ఫర్స్‌ చేస్తుంది తప్పులు చేస్తున్నందుకు కాదు సార్‌…తప్పులు బయటపెడుతున్నందుకు

20 సంవత్సరాల కేసులో నిజానిజాలు తెలుసుకోవడం…ఎవర్నీ అడుగుతారు..ఎవర్ననీ వెతుకుతారు

నాకు నా కూతురు..నా భార్య..నా ప్రాణం కంటే…ఈ కేసే ఇంపార్టెంట్‌…

 

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi