విజయ్‌ సేతుపతి స్లమ్‌డాగ్‌

Viswa

Web Stories

Vijay Sethupathi Slumdog: విజయ్‌సేతుపతి హీరోగా నటించిన కొత్త సినిమాకు ‘స్లమ్‌డాగ్‌’ (Vijay Sethupathi Slum Dog movie) అనే టైటిల్‌ ఖరారైంది. ‘‘33 టెంపుల్‌ రోడ్‌’ అనేది క్యాప్షన్‌. పూరీ జగన్నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టబు, సంయుక్త, విజయ్‌కుమార్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు (Slum Dog cast and crew)ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 16న విజయ్‌ సేతుపతి బర్త్‌ డే సందర్భంగా ‘స్లమ్‌డాగ్‌’ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ మాస్‌గా, పూరీ జగన్నాథ్‌ మార్క్‌ స్టైల్లో కనిపిస్తుంది (Slum Dog Vijay Sethupathi film).

 

VijaySethupathi and PuriJagannadh Movie Titled as SlumDog

నిజానికి ‘స్లమ్‌డాగ్‌’ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గత ఏడాది పూరీ జగన్నాథ్‌ బర్త్‌ డే సందర్భంగానే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో విజయ్‌ సేతుపతి బర్త్‌ డే సందర్భంగా జనవరి 16న అధికారికంగా ప్రకటించారు. ‘అర్జున్‌రెడ్డి, యానిమల్‌’ సినిమాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పూరీ జగన్నాథ్, చార్మీకౌర్, జేబీ నారాయణరావు ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడం,మలయాళం, హిందీ భాషల్లో ఈ ‘స్లమ్‌డాగ్‌’ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ వేసవిలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Please Share
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi