కమల్‌హాసన్ లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’ చిత్రం రేపు థియేటర్స్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. మణిరత్నం దర్శకుడు. ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచ నాలే ఉన్నాయి. ‘థగ్‌లైఫ్’ సినిమా ట్రైలర్ కూడా ఫర్వాలేదనిపించింది. కానీ ‘థగ్‌లైఫ్’ సినిమా కర్ణాకటలో విడుదలపై ఇంకా క్లారిటీ రావడం లేదు (Thuglife Controversy).
‘కర్ణాటక’లో జరిగిన థగ్‌లైఫ్ ప్రమోషనల్ కార్యక్రమానికి కమల్‌హాసన్ (KamalHaasan ThugLife) అండ్ టీమ్ హాజరై య్యారు. అయితే ఈ వేడుకలో తమిళ భాష నుంచి కన్నడ భాష ఉద్భవించినట్లుగా కమల్ హాసన్ మాట్లాడారు. దీంతో వివాదం చేలరేగింది. ఈ విషయంలో కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లేకపోతే, థగ్‌లైఫ్ సినిమాను జూన్ 5న రిలీజ్ కానివ్వమని, కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ చెబుతోంది. కన్నడ ప్రజలు కూడా ఈ విషయంలో కమల్‌హాసన్‌పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ కూడా కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఓ లేఖ రాశారు. పరోక్షంగా క్షమాపణలు చెప్పననే చెప్పాశారు. పైగా కమల్‌హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, థగ్‌లైఫ్ సినిమా రిలీజ్ అడ్డంకులను తొలగించాలని విజ్ఞప్తి చేశాడు. కానీ కమల్‌హాసన్‌కు పాజిటివ్ రిజల్ట్ రాలేదు. కమల్‌హాసన్ ఏమీ భాషపరిశోధకుడు కాదని, అలాంటప్పుడు కమల్‌హాసన్ అలాంటి తరహా కామెంట్ ఎలా చేస్తారని, కోర్టు కమల్‌హాసన్‌ను ప్రశ్నించిందనే వార్తలు ఉన్నాయి. పైగా క్షమాపణతో పోయే విషయాన్ని ఇంతదూరం తీసుకురావడంలో కూడా అర్థం లేదని కోర్టు కమల్‌హాసన్‌కు హితవు పలికిందనే వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ‘థగ్‌లైఫ్’ సినిమా రిలీజ్‌ను కర్ణాటకలో నిలిపివేయాలని కమల్‌హాసన్ అనుకుంటున్నారు. ఇదే జరిగితే...‘థగ్‌లైఫ్’ (Thuglife) సినిమాకు పదికోట్ల రూపాయాలకు పైగా నష్టం రావొచ్చు (Thuglife Controversy).
మరోవైపు కమల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’ సినిమాకు స్మూత్ రిలీజ్‌ను ఏర్పాట్లు చేయాలన్నట్లుగా తమి ళనాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ లేఖను విడుదల చేసింది. దీంతో..కర్ణాటకలో థగ్‌లైఫ్ రిలీజ్ భవితవ్యం ఎలా ఉంటుందో అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే ‘థగ్‌లైఫ్’ సినిమా రిలీజ్‌కు మరికొన్ని గంటల సమయం ఉంది కాబట్టి…మరి..ఏం జరుతుందో చూడాలి.