Toxic movie story: ‘కేజీఎఫ్’ వంటి స్టన్నింగ్ యాక్షన్ ఫిల్మ్ తర్వాత యశ్ హీరోగా చేస్తున్న గ్యాంగ్‌స్టర్ సినిమా ‘టాక్సిక్’ (Toxic Movie). ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యశ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఓ దశలో యశ్ ద్విపాత్రా భినయం చేస్తున్నాడనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. ఇందుకు తగ్గట్లుగానే, ‘టాక్సిక్’ సినిమా నుంచి రాయ, టికెట్…అంటూ…రెండు డిఫరెంట్ లుక్స్ బయటకు వచ్చాయి.
అలాగే ఇప్పటివరకు వచ్చిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి, టాక్సిక్ సినిమా,ఓ ఫుల్‌ఫ్లెడ్జ్ యాక్షన్ మూవీ అని అందరు ఊహిస్తున్నారు. కానీ.. ఈ సినిమాలో మానవీయ అనుబంధాలు, భావోద్వే గాలకు పెద్దపీట వేశానని హీరో యశ్ చెబుతున్నారు (Toxic Movie story).
అంతర్జాతీయ వేదిక సినీకాన్ ఫిల్మ్ వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఈ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిం చారు. మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే….‘టాక్సిక్’ సినిమాలో సైకాలజికల్ అంశాలను కూడా టచ్ చేశారట. ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సైకలాజికల్ అంశం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
గతంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ముందు అనుకున్న కథ వేరు..కానీ ఆ తర్వాత….ఈ సినిమాకు సైకలాజికల్ అంశాన్ని జోడించారు. ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు మా రుతినే స్వయంగా చెప్పారు. కానీ సైకలాజికల్ మైండ్ గేమ్ బాగానే ఉన్నప్పటికీని, ఆడియన్స్‌కు సరైన విధంగా రిసీవ్ కాలేదు. రిజల్ట్ కూడా తేడా కొట్టింది. ఈ నేపథ్యంలో ‘టాక్సిక్’ సినిమాలో ఈ సైకలాజికల్ అంశాన్ని, ఈ చిత్రం దర్శకురాలు గీతూమోహన్‌దాస్ ఎలా డీల్ చేశారనే విషయంపై జూన్ 4న తెలుస్తుంది. ఎందుకంటే..ఈ సినిమాను ఆ రోజే రిలీజ్ చేయనున్నారు. మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకాలపై వెంకట్. కె.నారాయణ, యశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.