Vikram Sahidev’s Anakapalli Movie: ‘నేను లోకల్’ ఫేమ్ దర్శకుడు నక్కిన త్రినాథరావు కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటుగా, ఆయన ఓ కీలక పాత్రలో నటించిన సినిమా ‘అనకాపల్లి (Anakapalli Movie)’. ఖగేష్ తమ్మినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కండ్రేగుల కుమార్ రాజా ఈ సినిమాకు సహ-నిర్మాతగా ఉండగా, కండ్రేగుల నాయుడు- నక్కిన త్రినాథరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్ (Vikram Sahidev), సంధ్య వశిష్ట ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే.. ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. అదీ తెలిసినోడికి ఓబీ రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి.. మనకి కావాల్సింది దక్కించు కోవాలి’.. ఇటువంటి సంభాషణలు ‘అనకాపల్లి’ సినిమా టీజర్‌లో ఉన్నాయి. ఈ సినిమాను ఈ వేసవిలో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కానీ విడుదల తేదీ ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, మరియు సంగీత క్రిస్‌లు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
నక్కిన త్రినాథరావు నిర్మించిన తొలి సినిమా ‘చౌర్యపాఠం’ ఫర్వాలేదనిపించింది. ఆయన కథ అందించి, నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ఇక నక్కిన త్రినాథనావు దర్శకత్వంలో ప్రస్తుతం ‘నేను రెడీ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. హవీష్, కావ్యాథాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ వేసవిలోనే రిలీజ్‌కు సిద్ధమైంది. విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.
Yo, check out ph898. Heard some rumblings it’s the real deal. Gonna give it a spin myself and see if it lives up to the hype. Fingers crossed!
SuperKingCasino, yeah, I browse it. VIP program’s nice if you play a lot. Site looks good, but sometimes it lags. Still, worth a look see superkingcasino.
Yo, ls168gamedownload seems to be the place to grab some games. Just be careful about where you download from. Always check the reviews! ls168gamedownload