ThimmarajuPalli TV Movie: హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (ThimmarajuPalli TV Movie). ఈ చిత్రంలో సాయితేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యానారాయణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈ నెల 17న (ThimmarajuPalli TV Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
దీంతో ఈ పీరియాడికల్ విలేజ్ డ్రామా సినిమా నుంచి ‘నిజమేనా..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సంగీత దర్శకుడు వంశీకాంత్ రేఖన స్వరకల్పనలో, సనరే లిరిక్స్ రాయగా, జయశ్రీ పల్లెం పాడారు
‘నిజమేనా నిజమేనా నే విన్నది నిజమేనా…, నువు పలికిన ఆ మాటే పొరబడి విన్నానా… నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా… కను తెరిచి నీ ముందే కలనే కన్నానా….. ప్రతి క్షణం నీ వెంటే ఇన్నాళ్లుగా తిరిగానే, నేనేమిటో కొంచెం కూడా అర్థం కాలేదా…’ అంటూ హార్ట్ టచింగ్ గా సాగుతుందీ పాట.