Don’t Trouble the Trouble teaser: మలయాళ నటుడు ఫాహాద్‌ఫాజిల్ హీరోగా చేస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్ర బుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ (Don’t Trouble the Trouble teaser) చేసి, ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబరు 11న (Don’t Trouble the Trouble Release date) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో ఫాహాద్‌ఫాజిల్‌తో పాటుగా బాలనటి సారా మరో లీడ్ రోల్ చేస్తున్నారు. సూరి పాత్రలో ఫాహాద్‌ఫాజిల్, దివ్య పాత్రలో సారా కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ ఇంకా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూనే ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణను కాస్త ఆలస్యంగా స్టార్ట్ చేశామని ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ఎస్‌ఎస్ కార్తికేయ తెలిపారు.
టీజర్‌ను చూస్తుంటే…ఇందులో సూరి మ్యాజిక్ చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అల్లాద్దీన్ అద్భుతదీపానికి చెందిన చిన్నారిగా సారా కనిపిస్తోంది. ‘‘సూరి ఇల్లు మ్యూజిక్ హౌస్‌లా ఉంది’, ‘కాపాడండి.. కాపాడండి.. అమ్మో దెయ్యం..’, ‘వాడేసుకో…అల్లాదీన్‌కి అద్భుతదీపం దొరికింది…వాడేసుకో..’ అన్న డైలాగ్స్ ఈ సినిమా టీజర్‌లో ఉన్నాయి. రాజమౌళి సమర్పణలో శోభుయార్లగడ్డ, దేవినేని ప్రసాద్, ఎస్‌ఎస్‌కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
Super easy login and the games are top notch. I had a great run last night and the withdrawal was instant. Visit boswin77login for a great experience.
v3gameapp, cool! Must be the third version. I’m hoping they’ve ironed out all the kinks by now! Time to see if it’s worth my time. Check it out at v3gameapp
I’ve tried a few sites lately but this one is definitely the smoothest. The login is fast and I love the game variety. Check out x777eelogin for a great experience!