AlluArjun New film Raaka: ‘పుష్ప: ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా కమిటైయ్యారు అల్లు అర్జున్. గత ఐదేళ్లలో తమిళ దర్శకులతో సినిమా చేసిన ఏ తెలుగు హీరోకు అచ్చొచ్చింది లేదు. శంకర్‌తో రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ కావొచ్చు, వెంకట్ ప్రభుతో నాగచైతన్య ‘కస్టడీ’ కావొచ్చు, లింగుసామీతో రామ్ ‘ది వారియర్’ కావొచ్చు. అన్నీ డిజాస్టర్ సినిమాలే. ఇలాంటి తరుణంలో తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నారన్న అనౌన్స్‌మెంట్‌నే అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది.
ఇప్పుడు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న…అట్లీతో అల్లుఅర్జున్ చేస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. మొదట్నుంచి ఈ సినిమాకు చెందిన కంటెంట్ ఏదీ బయటకు రాకపోవడంతో, ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ఏమై ఉంటుందా? అని సర్వత్రా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ‘రాకా’ (AlluArjun New Film Raaka) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలిపి, డిఫరెంట్ గెటప్‌లో ఉన్న అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్‌ను (Raaka First Look) రిలీజ్ చేశారు.
ఇలా ‘రాక’ ఫస్ట్‌లుక్ (Raaka FirstLook) వచ్చిందో లేదో..అలా పోలికలు మొదలైపోయాయి. ఈ సినిమా పాతకాలం నాటి ఓనీడా యాడ్‌ను గుర్తు చేసిందని ఒకరు, శంకర్ ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’గా విడుదలైంది), ఎన్టీఆర్– మెహర్‌రమేష్ డిజాస్టర్ మూవీ ‘శక్తి’లో విలన్ పేరు ‘రాకా’ అని, హిందీ ‘కామిక్ ‘చాచా చౌదరి’లోని డెకాయిట్ పేరు..‘రాక’ అని ఉందని, వరుణ్‌ధావన్ ‘భేడియా’లో తోడేలుగా కనిపించారని…ఇలా ఎవరు వారు వారికి గుర్తొచ్చిన జ్ఞాప కాలను గుర్తు చేశారు. ఇన్ని పోలికలు వచ్చాయంటంటే…ఆడియన్స్ ‘రాకా’పై ఎంతటి అంచనాలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

కానీ ‘రాకా’ సినిమా నుంచి వీడియో కంటెంట్ ఏదీ బయటకు రాకపోవడం అనేది మాత్రం బన్నీ ఫ్యాన్స్‌ను కాస్త నిరాశపరచమే అంశమే అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పట్నుంచో జరుగుతోంది. కనీసం ఓ 60 సెకన్ల నిడివి ఉన్న వీడియో అన్న మేకర్స్ బయటకు వదిలి ఉంటే..ఇన్‌స్టా, యూ ట్యూబ్‌లో ‘రాకా’ మోత మరింత వినిపించేంది. ‘పుష్ప’ సినిమా సెట్స్‌పై ఉన్పప్పుడు…అల్లు అర్జున్ బర్త్ డే వచ్చిన ప్రతిసారి.. .వీడియో కంటెంట్‌నే బయటకు వచ్చింది. అది సినిమా ప్రమోషన్‌కు బాగా హెల్పైంది. కానీ ఈ సారి అలాంటిది ఏమీ లేకపోవడం మాత్రం కాస్త నిరాశపరిచింది.
రాకా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో, రాకా సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని స్పష్టమైపోయింది. అది ద్విపాత్రాభినయంనా, లేక త్రిపాత్రాభినయం నా? అనేది తెలియాలి. వీటిలో ఏదీ అయినా సరే…బన్నీ ఇలా చేయడం, ఆయన కెరీర్‌లో తొలిసారే అవుతుంది. అలాగే ‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ విలన్‌గానూ నటిస్తారని తెలిసింది. ‘రాకా’ సినిమా షూటింగ్ ప్రజెంట్ జరుగుతోంది. భారీ వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌తో కూడిన ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
The live dealer section feels incredibly authentic with real time chat and quick bet confirmations. I appreciate how the stream quality stays sharp even during peak hours. It brings the floor atmosphere right to my living room. bdwlnbd
I absolutely love how smooth the gaming experience is on this platform. The live dealer games run without any lag and the customer support team is always ready to help me out. It feels like walking into a premium lounge right from my couch. Thanks for keeping things fair and exciting every single time I log in. lightningstormlivecasino
Just wanted to drop a quick note saying how impressed I am with the whole experience here. The app is lightweight, the games run flawlessly, and I appreciate how transparent they are about game rules and payout percentages. Their support team is always available and polite. I recommend this to anyone who wants a stress free gaming environment. vnx88kere