టాక్సిక్‌..సైకలాజికల్‌ మూవ్‌!

Viswa
1 Min Read

Web Stories

Toxic movie story: ‘కేజీఎఫ్‌’ వంటి స్టన్నింగ్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ తర్వాత యశ్‌ హీరోగా చేస్తున్న గ్యాంగ్‌స్టర్‌ సినిమా ‘టాక్సిక్‌’ (Toxic Movie). ఈ పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో యశ్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఓ దశలో యశ్‌ ద్విపాత్రా భినయం చేస్తున్నాడనే టాక్‌ కూడా తెరపైకి వచ్చింది. ఇందుకు తగ్గట్లుగానే, ‘టాక్సిక్‌’ సినిమా నుంచి రాయ, టికెట్‌…అంటూ…రెండు డిఫరెంట్‌ లుక్స్‌ బయటకు వచ్చాయి.

అలాగే ఇప్పటివరకు వచ్చిన ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌ను బట్టి, టాక్సిక్‌ సినిమా,ఓ ఫుల్‌ఫ్లెడ్జ్‌ యాక్షన్‌ మూవీ అని అందరు ఊహిస్తున్నారు. కానీ.. ఈ సినిమాలో మానవీయ అనుబంధాలు, భావోద్వే గాలకు పెద్దపీట వేశానని హీరో యశ్‌ చెబుతున్నారు (Toxic Movie story).

అంతర్జాతీయ వేదిక సినీకాన్‌ ఫిల్మ్‌ వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఈ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిం చారు. మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే….‘టాక్సిక్‌’ సినిమాలో సైకాలజికల్‌ అంశాలను కూడా టచ్‌ చేశారట. ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో సైకలాజికల్‌ అంశం ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గతంలో ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ముందు అనుకున్న కథ వేరు..కానీ ఆ తర్వాత….ఈ సినిమాకు సైకలాజికల్‌ అంశాన్ని జోడించారు. ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు మా రుతినే స్వయంగా చెప్పారు. కానీ సైకలాజికల్‌ మైండ్‌ గేమ్‌ బాగానే ఉన్నప్పటికీని, ఆడియన్స్‌కు సరైన విధంగా రిసీవ్‌ కాలేదు. రిజల్ట్‌ కూడా తేడా కొట్టింది. ఈ నేపథ్యంలో ‘టాక్సిక్‌’ సినిమాలో ఈ సైకలాజికల్‌ అంశాన్ని, ఈ చిత్రం దర్శకురాలు గీతూమోహన్‌దాస్‌ ఎలా డీల్‌ చేశారనే విషయంపై జూన్‌ 4న తెలుస్తుంది. ఎందుకంటే..ఈ సినిమాను ఆ రోజే రిలీజ్‌ చేయనున్నారు. మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్, కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై వెంకట్‌. కె.నారాయణ, యశ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

Please Share
Share This Article
1 Comment
  • Реабилитация алкоголиков с анонимной поддержкой — это процесс, при котором пациент получает необходимую медицинскую и психологическую помощь, не раскрывая своей личности и обстоятельств зависимости, включая лечение наркомании. Такие программы ориентированы на безопасное и конфиденциальное лечение, что важно для тех, кто стремится избавиться от зависимости, но опасается осуждения или утраты личной репутации, при этом возможен выезд нарколога на дом. Важно, что анонимность не ограничивает качество предоставляемых услуг: все необходимые этапы лечения, включая детоксикацию, психотерапевтические сессии и социальную реабилитацию, которые могут длиться несколько лет, проводятся на высоком уровне с акцентом на своевременный вывод из состояния зависимости.
    Получить больше информации – клиника реабилитации алкоголиков город

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi