2027లో ఎన్టీఆర్‌నీల్‌ సినిమా…అధికారిక ప్రకటన వచ్చేసింది….!

Viswa
2 Min Read
NTR Dragon Release date

Web Stories

NTRNeel Movie new Release date: అందరూ ఊహించినట్లుగానే జరిగింది. ఎన్టీఆర్‌నీల్‌ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా  (NTRNeel Movie) ఈ ఏడాది విడుదల కావడం లేదు. ఎన్టీఆర్‌ (NTR) హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమా ఇది. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో రుక్మిణీవసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిల్‌ కపూర్, ఆలియాభట్‌ వంటివారు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే వీరు ఈ సినిమాలో భాగమైయ్యారా? లేదా అనేది యూనిట్‌ నుంచి అధికారికంగా రావాల్సి ఉంది.

ఎన్టీఆర్‌నీల్‌ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరి 9న రిలీజ్‌ చేయనున్నట్లుగా ఏడాదిన్నర క్రితం ప్రక టించారు. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌ 25న రిలీజ్‌ అంటూ ప్రకటించారు. తాజాగా ఈ సారి ఏకంగా.. ఏడాది పాటు వాయిదా వేసి, వచ్చే ఏడాది జూన్‌ 11న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రక టించారు. అలాగే ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఎన్టీఆర్‌నీల్‌ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు.

NTRNeel Movie Releaseing on 2027 June 11

ఈ సినిమా షూటింగ్‌ స్టారై్టనప్పట్నుంచి ఏవో అవాంతరాలు ఎదరవుతూనే ఉన్నాయి. కొంత షూటింగ్‌ తర్వాత, అవుట్‌పుట్‌ నచ్చక, మళ్లీ రీ షూట్‌ చేశారట. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తు న్నారని తెలిసింది. దీంతో లుక్స్‌ మధ్య వేరియేషన్స్‌తో కూడిన సన్నివేశాల చిత్రీకరణకు సమయం పడుతుందట. ఈ సినిమా కోసం జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా, ఎన్టీఆర్‌ జిమ్‌లో గాయపడ్డారు. షూటింగ్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ సినిమాలోని విలన్‌ రోల్‌ నుంచి మలయాళ యువ నటుడు టోవినోథామస్‌ తప్పుకున్నారు. ఇలా వరుస సంఘటనల నేపథ్యంలో ఎన్టీఆర్‌నీల్‌ సినిమా రిలీజ్‌ వాయిదా పడిందని ఊహించవచ్చు.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్, మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఈ ఎన్టీఆర్‌నీల్‌ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు టీ–సిరీస్‌ వంటి పెద్ద నిర్మాణ సంస్థ కూడా భాగమైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీతం రవిబస్రూర్‌. ఇక ఈ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ను మేకర్స్‌ అనుకుంటున్నారని తెలిసింది.

Please Share
Share This Article
3 Comments
  • Реабилитация алкоголиков с анонимной поддержкой — это важный процесс, который помогает людям справиться с зависимостью в условиях конфиденциальности и безопасности. Многие пациенты опасаются обращаться за помощью из-за стереотипов и страха осуждения. Анонимность в реабилитации становится важным фактором для обеспечения доверия и максимальной эффективности лечения, при этом в ряде случаев доступны такие услуги, как кодирование и консультации наркологической помощи бесплатно, особенно при обращении после запоя. В Москве существует множество центров, которые предлагают реабилитацию алкоголиков с анонимной поддержкой, что позволяет пациентам пройти лечение, не раскрывая своей личности и не беспокоясь о социальном осуждении.
    Получить больше информации – http://www.domen.ru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu