Rao Bahadur Release: ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (2020) సినిమా తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేశ్ మహా కాంబినేషన్‌లో రూపొందిన తాజా సినిమా ‘రావు బహదూర్’. ఈ పీరియాడికల్ సైకాలాజికల్ థ్రిల్లర్ సినిమాకు ‘అనుమానం పెనుభూతం’ అనేది ట్యాగ్‌లైన్. వికాస్ ముప్పాల, దీపాథామస్, బాల పరాసర్,ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ప్రమోషన్స్ ఇటీవల ఊపందుకున్నాయి.కానీ రిలీజ్ డేట్‌పై స్పష్టత రాలేదు. తాజాగా ఈ ‘రావు బహదూర్’ (Rao Bahadur cinema) సినిమాను ఈ ఏడాది జూన్ 5న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు (Rao Bahadur Release date) . మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ల జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు జూన్ 4న యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ నెక్ట్స్ రోజే, ‘రావు బహదూర్’ సినిమా రిలీజ్ అవుతుంది. మరి… సత్యదేవ్‌కు ఇది ఎంత వరకు కలిసి వస్తుందనేది చూడాలి. ఒకవేళ టాక్సిక్ సినిమా కనుక జూన్ 4న విడుదల కాకపోతే, మాత్రం సత్యదేవ్‌కు ఒక మంచి రిలీజ్ డేట్ దొరికినట్లే.