క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

PR
PR
4 Min Read

Web Stories

Jungle Boogie: క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొంటాయి. ఈ నెల 17,18వ తేదీల్లో హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా జరిగే ఆడిషన్స్ నుంచి వివిధ దశల వడబోత అనంతరం పోటీదారులను ఎంపికచేయనున్నారు. ఆడిషన్స్ లోఎంపికైన వారు 90 రోజుల పాటు అడవిలో ఉంటూ కార్యక్రమ నిర్వాహకులు సూచించే సాహసాలు చేయాల్సి ఉంటుంది. ఎలిమినేషన్స్ తట్టుకుని ఫైనల్‌గా మిగిలిన కంటెస్టెంట్ విజేత గా నిలుస్తారు. శనివారం జరిగిన ఈ రియాల్టీ షో కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌లో

డైరెక్టర్ యశోధర విక్రమ్ మాట్లాడుతూ- ” నేను దర్శకుడిగా, రైటర్ గా కన్నడ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలు చేశాను. ఈ కాన్సెప్ట్ నా మిత్రుడు వినోద్ ఇచ్చారు. ఆయన గతంలో కొన్ని రియాల్టీ షోస్ చేశారు. నేను ఒక మూవీ కోసం ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు ముందు ఈ రియాల్టీ షో చేద్దాం ఆ తర్వాత సినిమా చేద్దాం అన్నారు. కాన్సెప్ట్ విన్న తర్వాత ఇది చాలా కష్టమైన రియాల్టీ షో, ఛాలెంజింగ్ గా ఉంటుందని అనిపించింది. ప్రముఖ ఛానెల్స్ ను అప్రోచ్ అయ్యాం. పైలట్ ఎపిసోడ్ అడిగారు. త్వరలోనే వారి నుంచి అప్రూవల్ వస్తుంది. జంగిల్ బుగికి దర్శకత్వం వహించడం ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం” అన్నారు.

ఎపిక్ ప్రొడక్షన్స్ అధినేత పార్థసారథి మాట్లాడుతూ – భారత్ అంటే వివిధ సంస్కృతుల సమ్మేళనం. పేరుకే వివిధ రాష్ట్రాల నుంచి పోటీ అని పెట్టాం కానీ మన కల్చర్ ఒకటే అనే చెప్పే ఉద్దేశంతో ఈ షో చేస్తున్నాం. ప్రకృతికి మనం దూరమై పోతూ ఉన్నాం. అడవి అనేది కనుమరుగు అవుతోంది. అడవి, పంటపొలాలు, ప్రకృతి..ఎంత గొప్పగా ఉంటాయో అందరికీ చూపించాలనే లక్ష్యంతో జంగిల్ బుగి రియాల్టీ షో నిర్వహిస్తున్నాం. ఈ షోను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం” అన్నారు.

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – ”జంగిల్ బుగి అనే రియాల్టీ షోను ఒక పాన్ ఇండియా మూవీ స్థాయిలో డిజైన్ చేయడం గొప్ప విషయం. ఐదు టీమ్స్ ఈ రియాల్టీ షోలో పాల్గొనబోతున్నాయి. ఈ నెల 17, 18 తేదీల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఆడిషన్స్ నుంచి ఎంపికైన వారిని రియాల్టీ షోకు తీసుకుంటారు. 90 రోజులు అడివిలో ఉండి సాహసాలు చేసే ఈ రియాల్టీ షో పార్టిసిపెంట్స్ తో పాటు షో నిర్వాహకులకు కూడా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు. ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న జంగిల్ బుగి రియాల్టీ షో అన్ని భాషల్లో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.

Cross state Reality show Jungle Boogie Event

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ వైజే రాంబాబు మాట్లాడుతూ – ”రియాల్టీ షోస్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తుంటాయి. జంగిల్ బుగి కూడా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ రియాల్టీ షో మంచి ఆదరణ పొందాలి. టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ చెబుతున్నాం. అలాగే ఈ జంగిల్ బుగి రియాల్టీ షో కు మీడియా మిత్రుల సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. అన్నారు.

జనరల్ క్రియేటివ్ టీమ్ రషీద్ మాట్లాడుతూ – ”టీవీ కార్యక్రమాలు చాలా వరకు అసహజంగా ఉంటాయి. మా రియాల్టీ షో రియల్ గా ఉంటుంది. ఎక్కడా ఆర్టిఫిషల్ గా అనిపించదు. ఫారెస్ట్ లో 90 రోజుల పాటు అనేక అడ్వెంచర్స్ తో సాగే సరికొత్త రియాల్టీ షో జంగిల్ బుగి. మా రియాల్టీ షోలో పాల్గొనండి, అలాగే చూసి సపోర్ట్ చేయండి” అన్నారు.

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ – ”జంగిల్ బుగి రియాల్టీ షో అన్ని రియాల్టీ షోస్ కంటే ఎగ్జైటింగ్ కంటెంట్, కాన్సెప్ట్ తో వస్తోంది. ఈ షో మంచి విజయం సాధించాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా” అన్నారు.

జంగిల్ బుగి టీమ్ మెంబర్ కమల మాట్లాడుతూ – ”ఔత్సాహికులకు జంగిల్ బుగి రియాల్టీ షో ద్వారా ఒక గొప్ప వేదిక కల్పిస్తున్నాం. వ్యూయర్స్ కు మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ను మా షో ఇవ్వబోతోంది. ఈ షో ద్వారా మన ప్రకృతి ఎంత అద్భుతమైనతో తెలియజేసే ప్రయత్నం చేస్తాం” అన్నారు.

దర్శక నిర్మాత ఘంటా శ్రీనివాస్ మాట్లాడుతూ – ”నాకు రియాల్టీ షోస్ అంటే చాలా ఇష్టం. ఈ జంగిల్ బుగి రియాల్టీ షో కూడా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ రియాల్టీ షో పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు.

Please Share
Share This Article
136 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu